ఆంధ్రప్రదేశ్‌

ఆర్థికాభివృద్ధిపైనే ప్రధాన చర్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 9: జనాభాలో 50 శాతంగా ఉన్న మహిళల సాధికారత లక్ష్యంగా పవిత్ర సంగమంలో శుక్రవారం నుంచి మూడురోజులపాటు జరుగనున్న జాతీయ మహిళా సదస్సులో కుల, మత, వర్గ, ప్రాంత, రాజకీయాల కతీతంగా ఆడబిడ్డలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి పరిష్కార మార్గాలను అనే్వషించడం మినహా మరో ఎజెండా లేదని శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్పష్టం చేశారు. మహిళలపై జరుగుతున్న దాడులు, వివక్ష, ఆడపిల్ల పుడుతుందనే కారణంతో అబార్షన్ వంటి అంశాలపై చర్చించి వారు గౌరవంగా జీవించేలా ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థికాభివృద్ధి చెందేలా ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపైనే కీలక నిర్ణయాలు తీసుకుంటారన్నారు. శాసనసభ ఉప సభాపతి మండలి బుద్దప్రసాద్, సమాచార పౌరసంబంధాలశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డిలతో కల్సి ఆయన గురువారం మూడురోజులపాటు సదస్సులో జరిగే కార్యక్రమాలను వివరించారు. సదస్సు నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. ఇప్పటికి 12వేల మంది ప్రతినిధులు ఆన్‌లైన్‌లో తమ పేర్లను రిజిష్టర్ చేసుకున్నారని తెలిపారు. వీరందరికీ విడిది, ఉచిత బస్సు రవాణా, భోజన సదుపాయం అన్నింటి మించి భద్రతకు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. ప్రతి మహిళా ప్రతినిధికి ఆత్మీయతతో పువ్వు, దుర్గమ్మ కుంకుమ, చిన్న ఆభరణంతో పాటు దుర్గమ్మ ప్రసాదం ప్యాకెట్, వివేకానందుని బోధనల పుస్తకంతో కూడిన కిట్ అందజేస్తామన్నారు. ఈ సదస్సు విజయవంతం కావటం వలన తనకు, లేదా ముఖ్యమంత్రికి ప్రేరుప్రతిష్టలు పెరుగుతాయని భావించడం లేదన్నారు. దీనివలన సమాజంలో కొంతమేరైనా మార్పు రావాలనేది తన అభిమతంగా చెప్పారు. మహిళా రక్షణ చట్టాలను కూడా కఠినంగా అమలుచేయాల్సి ఉందన్నారు. మధ్యా హ్నం వరకు అతిధుల ప్రసంగాలు ఆ తర్వాత రౌండ్ టేబుల్ సమావేశాలు, సాయంత్రం నుంచి జాతీయ అంతర్జాతీయ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 100 కళాశాలలకు ప్రత్యక్ష ప్రసారం ఏర్పాట్లు చేయడమే గాక అక్కడ నుంచి కూడా ఎవరైనా నేరు గా మాట్లాడే అవకాశం కల్పిస్తామన్నా రు. సెల్‌ఫోన్‌ల ద్వా రా కూడా లైవ్ ఇస్తున్నామన్నారు. మూడోరోజున కళాక్షేత్రం నుంచి స్వరాజ్యమైదానం వరకు త్రీకె రన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమం లో బౌద్ధ గురువు దలైలామా, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ సమిత్రా మహాజన్, లబ్దిప్రతిష్టులైన పివి సింధు, కిరణ్ బేడీ, జస్టిస్ రోహిణి, శ్రీలంక ప్రధానమంత్రి సతీమణి విక్రమ్‌సింగ్, బంగ్లాదేశ్ స్పీకర్ తదితరులు పాల్గొంటారని కోడెల తెలిపారు. మా తెలుగు తల్లి మల్లెపూదండ ప్రార్ధనా గీతంతో సదస్సు ప్రారంభమవుతుందని అతిధుల ప్రసంగాలన్నీ ఆంగ్లంలోనే కొనసాగుతాయని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. శాసనసభ ఉప సభాపతి మండలి బుద్దప్రసాద్ మాట్లాడుతూ మహిళలకు సముచిత స్థానం కల్పించిన ఘనత దివంగత ఎన్టీఆర్‌కే దక్కుతుందంటూ తొలిసారిగా మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించారని ఆ తర్వాత స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించారన్నారు. మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ ప్రతిరోజూ సాయంత్రం జాతీయ, అంతర్జాతీయ కళాకారులతో సంగీత నృత్యోత్సవాలను నిర్వహించబోతున్నామని వివరించారు.