ఆంధ్రప్రదేశ్‌

సాధికారతకు.. డ్వాక్రా మహిళలే నిదర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 12: మహిళా సాధికారత కోసం 20 సంవత్సరాలు క్రితమే డ్వాక్రా సంఘాలు ఏర్పాటుచేసి మహిళల ఆర్థిక స్వావలంబన సాధించామని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కిమిడి మృణాళిని తెలిపారు. జాతీయ మహిళా పార్లమెంటు సదస్సులో భాగంగా మూడోరోజైన ఆదివారం ఉదయం జరిగిన కార్యక్రమంలో మంత్రి కిమిడి మృణాళిని మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో డ్వాక్రా సంఘాల ఏర్పాటు ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేశారని చెప్పారు. సంఘాలకు విరివిగా రుణాలు ఇస్తూ మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. తల్లిదండ్రుల్లో మార్పు రావటం వలనే జాతీయ మహిళా సదస్సుకు ఇంతమంది అమ్మాయిలు, మహిళలు రావటం జరిగిందని ఆడపిల్లలు కూడా విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్నారని ఇది మహిళా సాధికారతలో భాగమేనని అన్నారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల్లో నెలకొన్న ఆరోగ్య స్థితిగతులపై ప్రత్యేక దృష్టి సారించాల్సి వుందన్నారు.

చిత్రం..మంత్రి మృణాళిని