ఆంధ్రప్రదేశ్‌

సమస్యలకు పరిష్కారం చూపడంలో మహిళా పార్లమెంట్ సదస్సు విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 13: మహిళల అపరిష్కృత సమస్యలకు కనీసం పరిష్కార మార్గాన్ని చూపటంలో కూడా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చుచేసి నిర్వహించిన జాతీయ మహిళా పార్లమెంట్ ఘోరంగా విఫలమైందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సి రామచంద్రయ్య అన్నారు. ఉన్నత లక్ష్యాలతో నిర్వహించవలసిన ఇటువంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యక్రమంగా నిర్వహించడం సిగ్గుచేటని సోమవారం ఒక ప్రకటనలో ఆయన విమర్శించారు. పైగా మహిళా లోకానికి అవమానకరం అన్నారు. మహిళల హక్కుల కోసం, వారికి సంబంధించిన విద్య, ఆరోగ్యం, ఉపాధి, తదితర సామాజిక అంశాల్లో మెరుగుదల కోసం తపిస్తూ, ముఖ్యంగా దళిత, గిరిజన, ఆదివాసీ మహిళల అభ్యున్నతి కోసం తమ జీవితాలను ధారబోస్తున్న ఎంతోమంది ఆదర్శవంతులైన మహిళలను, సంస్థలను ఈ సదస్సుకు ఆహ్వానించకుండా వ్యాపార రంగ మహిళలకు ప్రాచుర్యం కల్పించారని విమర్శించారు.