ఆంధ్రప్రదేశ్‌

బాల్య వివాహాల్లో కృష్ణా జిల్లా ఫస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 13: బాల్య వివాహాల్లో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో కొనసాగుతోంది. మహిళల్లో 18 ఏళ్లు, పురుషుల్లో 21 ఏళ్లు నిండకుండానే ఒక ఇంటి వారవుతున్నట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే బాల్య వివాహాల్లో జాతీయ సగటు 2.4 శాతం ఉండగా, రాష్ట్రంలో కృష్ణా జిల్లా 2.3 శాతంతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. బాల్య వివాహాల వల్లే మహిళల్లో పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నట్టు గుర్తించిన కుటుంబ ఆరోగ్య శాఖ అన్ని అంశాలతో సమగ్ర సర్వే నిర్వహించింది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు, ఇతర కారణాల రీత్యా దేశంలో 18 ఏళ్లు నిండకుండానే వివాహాలు చేసుకుంటున్న వారి శాతం 2.4గా నమోదైంది. రాష్ట్రానికి సంబంధించి ఇదే సర్వేలో తీవ్ర దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగుచూశాయి. రాష్ట్రంలో 20 నుంచి 24 మధ్య వయస్సున మహిళలను సర్వే చేయగా 32 శాతం మంది తమకు 18 ఏళ్లు నిండకుండానే వివాహమైనట్టు వెల్లడించారు. ఇది దేశ సగటుకు ఇంచుమించు దగ్గరగా ఉంది. ఇక అబ్బాయిల్లో 21 ఏళ్లు నిండకుండా వివాహం చేసుకుంటున్న వారి శాతం 2.3గా ఉంది. 25 నుంచి 29 సంవత్సరాల వయస్సున్న అబ్బాయిలను విచారించగా 23 శాతం మంది తమకు తమకు 21 ఏళ్లు నిండకుండానే వివాహమైందని పేర్కొన్నారు. బాల్య వివాహాల్లో రాష్ట్రం జాతీయ సగటుకు దగ్గరగా ఉండగా, రాష్ట్రంలో కృష్ణా జిల్లా మాత్రం అగ్రస్థానం దక్కించుకుంది. కృష్ణా జిల్లాలో సగటున 20,584 మంది బాలికలు 18 ఏళ్లు నిండకుండానే వివాహాలు చేసుకుంటున్నట్టు అధ్యయనంలో వెల్లడైంది. ఇది జాతీయ సగటుతో పోలిస్తే 3.3 శాతంగా నమోదైంది. అనంతపురం, విశాఖపట్నం, చిత్తూరు, కర్నూలు జిల్లాలు తరువాతి స్థానాల్లో నిలిచాయి. అబ్బాయిల్లో కూడా కృష్ణా జిల్లా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక్కడ అబ్బాయిలకు 21 ఏళ్లు నిండకుండానే వివాహ తంతు పూర్తి చేస్తున్నారు. కృష్ణా జిల్లా తరువాత కర్నూలు, విశాఖపట్నం, అనంతపురం జిల్లాలు కొనసాగుతున్నాయి.