ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వ ఉద్యోగుల ప్రతిష్ఠ పెంచుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 13: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం, శ్రేయస్సులే ధ్యేయంగా సేవలందిస్తూ సుదీర్ఘమైన చరిత్ర కలిగిన ఎపి ఎన్‌జివో సంఘ ప్రతిష్టను మరింత పెంచటంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు తమపైన ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా నూతన కార్యవర్గం పనిచేస్తుందని ఎపి ఎన్‌జివో అసోసియేషన్ రాష్ట్ర సంఘానికి మరోసారి ఎన్నికైన నూతన అధ్యక్ష, కార్యదర్శులు పి.అశోక్‌బాబు, ఎన్.చంద్రశేఖరరెడ్డి అన్నారు. ఎపి ఎన్‌జివో అసోసియేషన్ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక్షుడు పి.అశోక్‌బాబు, ప్రధాన కార్యదర్శి ఎన్.చంద్రశేఖరరెడ్డి, కార్యవర్గ సభ్యులతో స్థానిక గాంధీనగర్‌లోని ఎన్‌జివో హోంలో ఎన్నికల అధికారి సోమేశ్వరరావు సోమవారం ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో అధ్యక్షుడు అశోక్‌బాబు మాట్లాడుతూ సుదీర్ఘమైన చరిత్ర కలిగిన ఎపి ఎన్‌జివో అసోసియేషన్ ప్రభుత్వ ఉద్యోగులకు బాసటగా నిలుస్తూ ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య వారధిగా నిలిచి ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా ముందుకు వెళుతుందని చెప్పారు. గతంలో ఎంతోమంది నేతలు ఉద్యోగుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేసి సమస్యలను పరిష్కరించి వారికి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చారన్నారు. ఉద్యోగులకు పిఆర్‌సి అమలు, 43 శాతం ఫిట్‌మెంట్, సమ్మె కాలాన్ని ప్రత్యేక శెలవుగా మంజూరు చేయించడం, హెల్త్‌కార్డుల మంజూరు వంటి అనేక సమస్యలను పరిష్కరించామన్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి హెల్త్‌కార్డులపై మాస్టర్ హెల్త్ చెకప్‌ను చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. 3.80 లక్షల మంది ఉద్యోగులు, 4 లక్షల మంది పైగా పెన్షనర్లకు మాస్టర్ హెల్త్ చెకప్‌ను నిర్వహించి హెల్త్ రికార్డును నమోదు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇందుకు సుమారు వంద కోట్ల రూపాయలను భరించేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసిందన్నారు. దీంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వౌలిక వసతులను అభివృద్ధి చేసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులపై పెట్టే చికిత్స ఖర్చులు తగ్గే అవకాశం ఉందని, ఈ దిశలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరుతున్నామన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం తర్వాత ఉద్యోగుల్లో సామాజిక బాధ్యత మరింత పెరిగిందన్నారు. దాదాపు 14వేల మంది ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు కష్టనష్టాలను భరిస్తూ ప్రభుత్వం చేస్తున్న కృషికి తాము కూడా చేయూత ఇవ్వాలన్న లక్ష్యంతో ఎటువంటి వసతులు, వౌలిక సదుపాయాలు లేకపోయినా అమరావతికి తరలి వచ్చారని తెలిపారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో ఎన్‌జివో అసోసియేషన్లు ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తూ కీలకంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దుచేయాలనే నినాదంతో మార్చి 2న ఛలో పార్లమెంటు కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. పశ్చిమ కృష్ణా కార్యదర్శి ఎ.విద్యాసాగర్, కార్యదర్శి ఎండి ఇక్బాల్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు, జిల్లాలకు చెందిన ఎపి ఎన్‌జివో సంఘ జిల్లా, తాలూకా, నగర శాఖల కార్యవర్గ సభ్యులు, ఉద్యోగులు నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు.