ఆంధ్రప్రదేశ్‌

పారిశ్రామిక అవసరాలకు నీరేది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 15: అఖండ గోదావరి నదీ జలాలను కారు చౌకగా పారిశ్రామిక సంస్థలకు దారపోస్తున్నారు. అఖండ గోదావరి నదిలో కోట్ల రూపాయల నీళ్ల వ్యాపారం జరుగుతోంది. కేవలం వెయ్యి గ్యాలన్ల ముడి జలాలను రూ.4.50కే కేటాయించారు. దాదాపు దశాబ్ధకాలంగా ఇదే ధరకు గోదావరి జలాలను పారిశ్రామిక అవసరాలకు కేటాయిస్తున్నారు. అయితే ప్రతి యేటా పరిశ్రమలు పెరుగుతుండటంతో పారిశ్రామిక జలాల అవసరం కూడా ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోంది. ప్రస్తుతం కాకినాడ సెజ్, కోస్టల్ కారిడార్, విశాఖ ఫార్మా సెజ్‌ల అవసరాలు కూడా గోదావరి జలాల నుంచే తీర్చాల్సి వుంది. ఇందుకోసం ముడి జలాలను కేటాయించాల్సి వుంది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ పూర్తయితే తప్ప పారిశ్రామిక అవసరాలు తీరే పరిస్థితి కనిపించడం లేదు.
కొత్తగా వచ్చే పరిశ్రమలకు సంబంధించి, వేలకోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తున్న స్థాయిలో పారిశ్రామిక నీటి అవసరాలపై ముందస్తు ప్రణాళిక కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో కొత్తగా పరిశ్రమలకు సంబంధించి ఇంకా ప్రత్యేక ఏర్పాటు జరగలేదు. సముద్ర తీర ప్రాంతంలో ఉన్న పరిశ్రమలకు సంబంధించి పైపులైను, సమ్మర్ స్టోరేజి ట్యాంకుల ద్వారా గోదావరి జలాలను వినియోగించుకుంటున్నాయి. సామర్లకోట కెనాల్‌ద్వారా పారిశ్రామిక అవసరాలకు సరఫరా చేస్తున్నారు. నాగార్జున ఫెర్టిలైజర్స్, కోరమండల్ ఫెర్టిలైజర్స్ సంస్థలు గోదావరి జలాలను వినియోగించుకుంటున్నాయి. సముద్ర తీరంలో వచ్చే పరిశ్రమలకు అవసరమైన నీటిని సరఫరా చేసేందుకు సామర్లకోట కెనాల్ ప్రధాన భూమిక వహిస్తోంది. ఈ కెనాల్‌కు పారిశ్రామిక జలాల డిమాండ్ పెరిగింది.
సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజి ఎగువ అఖండ గోదావరి నదినుంచి విస్కో పైపులైన్ ద్వారా విశాఖలోని పరిశ్రమలకు జలాలను కేటాయించారు. బ్యారేజి దిగువన కడియం వద్ద ఈస్ట్రన్ డెల్టా కెనాల్ నుంచి కొన్ని విద్యుత్ సంస్థలకు, పరిశ్రమలకు నీటి కేటాయింపులు చేశారు. ఒక్కో పారిశ్రామిక సంస్థకు పది నుంచి పదిహేనేళ్ళ కాల పరిమితికి గోదావరి జలాలను కేటాయిస్తూ ప్రభుత్వం జీఓలు జారీ చేసింది.
ఈ మేరకు ప్రధానంగా ఎపి పేపర్ మిల్స్, విజ్జేశ్వరం పవర్ ప్లాంట్, కోనసీమ గ్యాస్ పవర్ ప్లాంట్, పాండురంగా ఎనర్జీ సిస్టమ్స్, తేజా బయో ఫ్లూయల్స్ ప్రైవేటు లిమిటెడె, సామర్లకోట పవర్ లిమిటెడ్, బయో ఇథనాల్ ఇండియా లిమిటెడ్, గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ మల్లవరం, వైట్ ఫీల్డ్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, గౌతమి పవర్ లిమిడెట్ తదితర సంస్థలకు గోదావరి ముడి జలాలను కేటాయించారు. ఇటు సాగునీటికి, అటు పారిశ్రామిక అవసరాలకు గోదావరి నదే ఆధారం. వేసవి సమీపిస్తోన్న తరుణంలో రబీ అవసరాలు తీరేందుకు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. దీనికితోడు పారిశ్రామిక అవసరాలు కూడా సమీకరించుకోవాలంటే రబీ మాదిరిగానే పరిశ్రమల కేటాయింపులకు కూడా ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాల్సి వుంది. పారిశ్రామిక అవసరాలు మాత్రం ప్రతి యేటా పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో పాత ధరలకు కాకుండా ధరలు పెంచి ముడి జలాలను కేటాయించాలని జల వనరుల శాఖ ప్రతిపాదించారు. దశాబ్ద కాలం క్రితంనాటి ధరలు కాకుండా ప్రస్తుతం డిమాండ్‌ను బట్టి కాస్తంత ధరలు పెంచితే ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం వుందని తెలుస్తోంది. మరోవైపు ఒఎన్‌జిసి అవసరాలు కూడా పెరుగుతున్నాయి. షేల్‌గ్యాస్ తీసేందుకు కూడా భారీస్థాయిలో ముడి జలాలను వినియోగించాల్సి వుంది. ఇప్పటికే ఆలమూరు వద్ద చేపట్టనున్న షేల్‌గ్యాస్ డ్రిల్లింగ్ పాయింట్‌కు పెద్దఎత్తున గోదావరి జలాలను వినియోగించాల్సి ఉంటుంది.
రబీ కాలంలో గోదావరి నదిలో నీటి లభ్యత క్రమేణా క్షీణించిపోతుంటుంది. దీంతో సీలే రు ఆధారంగా రబీ ప్రణాళిక రూపొందిస్తారు. పారిశ్రామిక అవసరాలకు కూడా సీలేరు జలాలనుంచే కేటాయించాల్సిన పరిస్థితి పొంచివుంది. ఏదేమైనప్పటికీ పెరుగుతున్న పారిశ్రామిక దాహార్తిని దృష్టిలో పెట్టుకుని ముందస్తు ప్రణాళిక మేరకు నీటిని కేటాయించడంతోపాటు ఎపుడో నిర్ణయించిన ధరలకు కాకుండా మారిన అవసరాలకు అనుగుణంగా ధరల్లో మార్పు చేసి ముడి జలాలను కేటాయిస్తే మరింత ఆదాయం పెరిగేందుకు అవకాశం ఉంటుందని సర్వత్రా కోరుతున్నారు.
దీనికి తోడు పారిశ్రామిక అవసరాలకు కేటాయించిన నీటికి సంబంధించి ఆయా సంస్థల కోట్లాది రూపాయల మేర బకాయిలు పేరుకుపోకుండా చూడాలని, వినియోగించిన జలాలకు మీటర్లపై సరైన పర్యవేక్షణ వుండాలని కోరుతున్నారు.