ఆంధ్రప్రదేశ్‌

మరో మూడు నీట్ కేంద్రాలు అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 15: వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే ‘నీట్’ కోసం రాష్ట్రంలో మరో మూడు కేంద్రాలు ఏర్పా టు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. రాష్ట్రంలోని 74 సిహెచ్‌సిల్లో డిజిటల్ ఎక్స్‌రేలను త్వరలో అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. విజయవాడలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి బుధవారం సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ నీట్‌కు సంబంధించి ఇప్పటికే రెండు కేంద్రాలు రాష్ట్రంలో ఉన్నాయని, వైద్య విద్యార్థుల అవసరాల దృష్ట్యా కర్నూలు, తిరుపతి, రాజమహేంద్రవరంలో కూడా ఈ పరీ క్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. ఎపికి సంబంధించిన వివిధ అంశాలపై కేంద్రంతో చర్చించేందుకు ఈ నెల 20న ఢిల్లీ వెళ్తున్నట్లు తెలిపారు. పీజీ సీట్లు, నీట్, ఉద్దానం, వైద్య, ఆరోగ్య శాఖ పెండింగ్ ప్రాజెక్టులపై చర్చిస్తానన్నారు. 74 సిహెచ్‌సిల్లో డిజిటల్ ఎక్స్‌రే సేవలను అందుబాటులోకి తేనున్నామన్నారు. త్వరలో అన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలోనూ పారిశుద్ధ్య విధానం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. శవపరీక్షలు, పంచనామాలు వేగంగా పూర్తిచేసి బాధిత కుటుంబాలకు నివేదికలు ఇవ్వాలని వైద్యాధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఇందుకు నిర్దిష్ట కాల పరిమితిని కూడా విధించుకోవాలన్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పరీక్షల్లో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని డిఎంఇని ఆదేశించామన్నారు. ఉద్దానం కిడ్నీ బాధిత ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, 114 గ్రామాల్లో తీసుకుంటున్న శాంపిల్స్, వైద్య సౌకర్యాలు, ఉచిత డయాలసిస్ సెంటర్ల పనితీరును సమీక్షించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఐదు స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయని, పొరుగు రాష్ట్రాల్లో ఈ కేసుల తీవ్రత అధికంగా ఉందన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. వైద్య రంగంలో ఎపిని మొదటి స్థానంలో నిలిపేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వైద్య పరీక్షలు, ఈ- ఔషధికి జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయని తెలిపారు.
అందరికీ ఆరోగ్యంలో భాగంగా త్వరలో ఆరోగ్య బీమాపై కలెక్టర్ల సమావేశాన్ని ముఖ్యమంత్రి నిర్వహించనున్నారని మంత్రి కామినేని వివరించారు. సమావేశంలో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, కమిషనర్ శామ్యూల్ ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..అధికారులతో సమీక్షిస్తున్న వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్