ఆంధ్రప్రదేశ్‌

కళలకు కాణాచి విజయనగరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఫిబ్రవరి 15: రాష్ట్ర ప్రభుత్వం, ఎపిఎఫ్‌డిసి సంయుక్తంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి నంది నాటకోత్సవ పోటీలు బుధవారంతో ముగిసాయి. విజయనగరంలో గత నెల 18న ప్రారంభమైన ఈ పోటీలు బుధవారం వరకు కొనసాగాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరికి చెందిన కళాకారులు తమ నటనా కౌశలంతో సందేశాత్మక నాటికలను ప్రదర్శించి ఆహుతులను అలరించారు. రెండు విడతలలో మొత్తం 77 నాటికలను ప్రదర్శించారు. తొలి విడత కింద జనవరి 18 నుంచి 25 వరకు 43 నాటికలను, రెండో విడత కింద ఈ నెల 11 నుంచి 15 వరకు 34 నాటికలను ప్రదర్శించారు. నాలుగు జిల్లాలకు చెందిన కళాకారులు ప్రదర్శించిన నాటికలలో మొదటి మూడింటిని ఎంపిక చేసి అమరావతిలో వారికి బహుమతులను అందజేస్తారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన కళాకారులు సామాజిక ఇతివృత్తం, సందేశాత్మకంతో కూడిన నాటికలను అద్భుతంగా ప్రదర్శించారు. అక్కినేని సాంస్కృతిక సమాజం ప్రదర్శించిన ‘మోహినీ భస్మాసుర’ పద్య నాటకంతో ప్రారంభమైన ఈ పోటీలు ది యంగ్‌మెన్స్ హ్యాపీ క్లబ్ ‘జననీ’ సాంఘిక నాటికతో ముగిసాయి. చివరి రోజున శ్రీకళానికేతన్ వారి ‘మాకొద్ది నాగరికత’, శిరీష ఆర్ట్స్ వారి ‘ఓక రాజకీయ కథ’, ప్రవాసాంధ్ర ప్రజానాట్యమండలి వారి ‘నిశ్చలన చిత్రాలు’, రసధ్వని గ్రామీణ సాంస్కృతిక సేవా సమితి వారి ‘పున్నామనరకం’, గురజాడ కళానికేతన్ వారి ‘ఒక్క అడుగు’, చైతన్య కళాస్రవంతి వారి ‘నాన్నా నువ్వో సున్నానా’, ది యంగ్‌మెన్స్ హ్యాపీ క్లబ్ వారి ‘జనని’ నాటికలను ప్రదర్శించారు. ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ యుసిజి నాగేశ్వరరావు మాట్లాడుతూ కళలకు కాణాచిగా పేరుగాంచిన విజయనగరం పట్టణంలో నందినాటకోత్సవ పోటీలు నిర్వహించడం ఆనందదాయకమన్నారు.

చిత్రం..ముగింపు ఉత్సవంలో ప్రదర్శించిన ‘మాకొద్దీ నాగరికత’ నాటికలోని ఒక సన్నివేశం