ఆంధ్రప్రదేశ్‌

వలసలతో బలపడుతున్న టిడిపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, ఫిబ్రవరి 15: వలసలతో కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ రోజురోజుకు బలపడుతోంది. జిల్లాలో అటు రెడ్లు, ఇటు కాపులు రాజకీయంగా బలమైన వర్గాలుగా ఉన్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ చెంగల్రాయుడు టిడిపిలో చేరడంతో పార్టీ మరింత బలపడిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఏడాది క్రితం కేంద్ర మాజీ మంత్రి ఏ.సాయిప్రతాప్ టిడిపిలో చేరారు. దీంతో కాపు సామాజికవర్గంలో పేరున్న శాసన మండలి పక్షనేత సి.రామచంద్రయ్య మినహా మిగతా నేతలంతా తెలుగుదేశం పార్టీలో చేరినట్టయింది. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినపుడు కాపులంతా ఆ పార్టీలో చేరారు. జిల్లాలోని రైల్వేకోడూరు, రాజంపేట, రాయచోటి, మైదుకూరు, కడప నియోజకవర్గాల్లో కాపు సామాజికవర్గానిదే పైచేయిగా కొనసాగుతోంది. వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సొంత జిల్లా అయిన కడపలో పార్టీని బలోపేతం చేసేందుకు తెలుగుదేశం అధిష్టానం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. కాగా మరికొంత మంది కాపు నేతలు టిడిపిలో చేరేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం.