ఆంధ్రప్రదేశ్‌

తెలుగుదేశం చిరకాలం ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుప్పం, ఫిబ్రవరి 16: ఆంధ్ర రాష్ట్ర చరిత్ర ఉండేం త వరకు తెలుగుదేశం పార్టీ కొనసాగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. గురువారం చిత్తూరు జిల్లా కుప్పంలోని పిఇఎస్ వైద్య కళాశాలలో ఆయన స్టీరింగ్ కమిటీ సభ్యులతో మాట్లాడారు. ప్రజల సహకారంతోనే పార్టీలు కొనసాగుతాయని అన్నారు. అధికారం ఉంది కదా అని భుజాలు ఎగురవేస్తే ఎన్నికల సమయంలో ప్రజలు ఇంటికి పంపిస్తారని, అలాకాకుండా ఎవరికి ఇచ్చిన బాధ్యత వారు నెరవేర్చాలని హితవు చెప్పారు. గ్రామీణ స్థాయి ప్రజల నుంచి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు అన్ని రకాల వారికి సహకారం అందించాలన్నారు. తాను చనిపోయినా తెలుగుదేశం పార్టీ చిరస్థాయిగా నిలవాలని ఆయన అన్నారు. గత 30 సంవత్సరాలుగా పార్టీ కోసం తాను ఎంత కష్టపడ్డానో అంతకు రెండింతలుగా మీరు కష్టపడాలన్నారు. అనంతరం కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంలో ప్రతి కుటుంబం నెలకు రూ.10 వేలు ఆదాయాన్ని సమకూర్చుకోడానికి వీలుగా ప్రణాళికలు రచిస్తున్నట్టు చెప్పారు. ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకుంటూ పదవులు రాలేదని, ఇతర కారణాల ద్వారా పార్టీకి చెడ్డపేరు తీసుకురావద్దని హితవుపలికారు.

చిత్రం..కుప్పంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తున్న
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు