ఆంధ్రప్రదేశ్‌

నెల్లూరు నగరంలో భారీ కబ్జా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరుసిటీ, ఫిబ్రవరి 16: నెల్లూరు నగరానికి నడిబొడ్డున గల క్రైస్తవులకు సంబంధించిన 100 సంవత్సరాల చరిత్ర గల సిఎఎం హైస్కూల్‌పై తెలంగాణ రాష్ట్రానికి చెందిన పరివార్ హోటల్ గ్రూప్స్ వారు కన్నువేశారు. అందులో భాగంగా గురువారం ఆ హోటల్స్‌కు సంబంధించిన ప్రతినిధులైన ఎంఎఐం నాయకులు వీరికి బంధువులైన నెల్లూరులో ఉన్న కొంతమంది ఏకంగా 16 ఎకరాల స్థలంలో 1840 సంవత్సరంలో స్కాట్‌లాండ్ చర్చమిషన్ నిర్మించిన సిఎఎం హైస్కూల్ కబ్జా చేశారు. స్కూల్‌కు సంబంధించిన బోర్డును రాత్రిరాత్రికే తొలగించి పరివార్ ప్యాలెస్ బోర్డును ఏర్పాటు చేశారు. ఎంతో చరిత్ర గల ఈ స్కూల్ పరివార్ ప్యాలెస్‌గా మారడంతో స్థానిక కార్పొరేటర్ దాసరి రాజేష్, క్రైస్తవు ఆస్తుల పరిరక్షణ కమిటీ నాయకులు బర్నాబాస్, వి సురేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సిఎఎం హైస్కూల్‌ను గోడలను తొలగించి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్న వారిని అదుపులో తీసుకున్నారు. క్రైస్తవులకు సంబంధించిన స్థలాన్ని ఒక వర్గం వారు ఆక్రమించుకోవడం దీనిపై నెల్లూరు జిల్లా ప్రజాప్రతినిధులు కూడా ఓటు బ్యాంకు రాజకీయాలను దృష్టిలో ఉంచుకున్న ఈ స్కూల్ కబ్జాపై నోరు మెదపడం లేదు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఈ హైస్కూల్ కబ్జాపై ఎమ్మెల్యే కూడా వౌనం వహించడంపై దీనిపై పలు అనుమానులు రేకెత్తుతున్నాయి. గత మూడు రోజుల క్రితం ఒక కార్పొరేటర్ భర్త 9 అంకణాల స్థలాన్ని ఆక్రమించుకుని ఆంగళ్ళను నిర్మిస్తున్నారని నానా రభస చేసిన ఎమ్మెల్యే కోట్లాది రూపాయలు విలువ చేసే సిఎఎం హైస్కూల్ కబ్జాపై మాత్రం నోరు మెదపడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. అదే విధంగా నగరంలో చీమచీటుక్కుమన్న నేను వున్నాని అనిపించుకుంటున్న మేయర్ కూడా దీనిపై వౌనంగా ఉండటంలో అంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. గతంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన క్రైస్తవులకు ఏ పార్టీ వారు కూడా సిఎఎం హైస్కూల్ పోరాటానికి ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా సహకరించిన దాఖలాలు కన్పించ లేదని క్రిస్టియన్ అసోసియేషన్ నాయకులు బర్నాబాస్ బహిరంగంగా చెప్పారు. వివరాల్లోకి వెళ్లితే తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎంఐఎం నాయకులు, నెల్లూరులో ఉన్న వారు బంధువులు గత కొన్ని నెలల క్రితం ఎటువంటి ఆధారాలు లేకుండా ఈ స్కూల్‌ను కొనుగోలు చేశామని, లీజు తీసుకున్నామని చెప్పి దౌర్జన్యంగా స్కూల్ కట్టడాలను తొలగించడంతో పూర్వ విద్యార్థులు, స్థానికులు అడ్డుకున్నారు. మిషనరీకి చెందిన ఆస్తులను గాని, స్కూల్‌ను గాని అమ్మే హక్కు లేదు. కొన్ని వేల మంది విద్యార్థులకు విద్యా బుద్దులు నేర్పించిన సిఎఎం హైస్కూల్ కబ్జా కాకుండా సంఘ సంస్కర్తలు అడ్డుకుంటున్నారు. 1915 సంవత్సరంలో సిఎఎం హైస్కూల్ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఈ స్కూల్ బాధ్యతను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. మిషనరీ కేవలం ఆలాన పాలన చూసే బాధ్యత తప్ప స్కూల్‌ను అమ్మే హక్కు కాని లేదు. ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కింద ఉన్న ఈ స్కూల్‌ను మిషనరీ సంస్థ మెయింటెనెన్స్ చేయికపోతే వాటి బాధ్యతను ప్రభుత్వానికి అప్పగించాల్సింది పోయి హోటల్ సంస్థకు ఇవ్వడంతో దీనిపై పూర్వ విద్యార్థులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిం చి స్కూల్‌ను యథావిధిగా నడిపించి క్రైస్తవుల ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని అంటున్నారు.

చిత్రం..సిఎఎం స్కూలుపై పరివార్ పేలస్ బోర్డు పెట్టిన దృశ్యం