ఆంధ్రప్రదేశ్‌

చకచకా ఫైబర్ గ్రిడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 16: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మొదలుపెట్టిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ తొలివిడత పూర్తి అయింది. ఫైబర్ నెట్ సేవలు తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లె మండలం మోరీ, మోరిపోడు గ్రామాల్లో గత నెలలో మొదలయ్యాయి. ఏపీఎస్ ఫైబర్‌నెట్ లిమిటెడ్ (ఏపిఎస్‌ఎఫ్‌ఎల్) ఆధ్వర్యంలో ఫైబర్ గ్రిడ్ పనులు జరుగుతున్నాయి. మొదట ఈ రెండు గ్రామాల్లోని పాఠశాలలతోపాటు 1200 ఇళ్లకు ఫైబర్ నెట్ సేవలు అందించే ఏర్పాటు చేశారు. తొలిదశలో పట్టణ ప్రాంతాల్లోని ఇళ్లకు ఎంఎస్‌ఓ (మల్టీ సిస్టమ్ ఆపరేటర్)లు, ఎల్సీఓల ద్వారా ఫైబర్ నెట్‌సేవలు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికి దాదాపు పదివేల నెట్ కనెక్షన్లు ఇచ్చారు. ఈ నెలాఖరునాటికి లక్ష బాక్సులు అమర్చాలని సిఎం అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 15 నాటికి పది లక్షల కనెక్షన్లు ఇచ్చే ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో మొత్తం లక్షా 30వేల కనెక్షన్లు ఇవ్వవలసి ఉంది. ఈ ప్రాజెక్టును ఈ ఏడాది చివరకు పూర్తిచేయాలన్నది లక్ష్యం. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు 8 జిల్లాల్లో ఈ పనులు పూర్తి అయ్యాయి. మొత్తం 23,500 కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ లైన్లు ఏర్పాటు చేయవలసి ఉంది. అందులో 22వేల కిలోమీటర్లకు పైగా లైన్లు పూర్తి అయ్యాయి. ఇప్పటికే ప్రభుత్వ విభాగాలన్నింటిలో డిజిటలైజేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. కొన్ని శాఖల్లో నూరు శాతం పూర్తి అయింది. ఈ విధంగా కొత్త శకానికి నాంది పలికి దేశంలో రాష్ట్రం ప్రత్యేక గుర్తింపు పొందింది. 133 ప్రభుత్వ విభాగాల్లో అన్ని రకాల సేవలను డిజిటలైజేషన్ చేస్తున్నారు. 33 శాఖలు, 315 సంస్థలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంటర్‌ప్రైజ్ ఆర్కిటెక్చర్ (ఏపీఎస్‌ఈఎ)లో భాగంగా మొత్తం 745 సేవలను అనుసంధానం చేసేలా ‘ఇ-ప్రగతి’ రూపకల్పన జరిగింది.