ఆంధ్రప్రదేశ్‌

నీ మాటలు విద్యార్థులు నమ్మరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 16: ఆదర్శవంతమైన జీవితం గడిపేవారు, సమాజం కోసం పాటుపడే మేధావులు నీతి వాక్యాలు బోధిస్తే విద్యార్థుల్లో చైతన్యం వస్తుంది కానీ, 11 ఛార్జిషీట్లలో ఏ1 ముద్దాయిగా ఉండి 16 నెలలు జైలుశిక్షను అనుభవించి ప్రతి శుక్రవారం కోర్టు మెట్లు ఎక్కే ప్రతిపక్ష నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డికి విద్యార్థులతో ‘యువభేరి’లు అంటూ సభలు, సమావేశాలు నిర్వహించే అర్హత లేదని సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు ఎద్దేవా చేశారు. గుంటూరులో జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటుచేసిన సభను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ విభజన కష్టాల నుండి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అహర్నిశలు కృషిచేస్తుంటే పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటూ యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా ప్రతిపక్ష నేత కుట్రలు చేస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు. ఘర్షణ ధోరణితో కేంద్రం నుండి రాష్ట్రానికి సహాయం పొందడం వివేకమా? లేక సామరస్య ధోరణితో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవడం సమంజసమా? అని మంత్రి అన్నారు. రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించాల్సిన సమయం వచ్చింది. కేంద్రం నుండి అన్ని పద్దుల కింద సహాయం పొందడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఎక్కువ నిధులు తెచ్చి ప్రజల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కృషి చేస్తుంటే, ప్రజల్లో అపోహలు సృష్టిస్తూ అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదు. అర్థం పర్థం లేని గణాంకాలు, పొంతనలేని లెక్కలు తయారుచేసి ప్రజలను రెచ్చగొట్టడం, ఆందోళనలతో ప్రజలను ప్రేరేపించడం ఇవి రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధం. హోదా ఉన్న 11 రాష్ట్రాలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో చివరిస్థానంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మాత్రం మొదటి స్థానంలో నిలిచింది. ఎవరికో భయపడి ప్రత్యేక ప్యాకేజీ ఒప్పుకున్నామని చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదన్నారు.