ఆంధ్రప్రదేశ్‌

హెల్త్‌సిటీగా విశాఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 11: అంతర్జాతీయస్థాయి హెల్త్‌సిటీగా విశాఖను తీర్చిదిద్దనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఒక్క రోజు పర్యటన నిమిత్తం సోమవారం విశాఖపట్నం వచ్చిన ఆయన కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 300 పడకల ఇఎస్‌ఐ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. అనంతరం విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్(విమ్స్)లో ఔట్‌పేషెంట్ విభాగాన్ని ప్రారంభించారు. ఎయు కాన్వొకేషన్ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిఎం మాట్లాడుతూ ఢిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్ (ఎయిమ్స్) తరహాలో విమ్స్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. తొమ్మిదేళ్ల క్రితం 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టిన విమ్స్‌కు పూర్తి స్థాయి సూపర్‌స్పెషాలిటీ సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఇదే ప్రాంతంలో హెల్త్‌సిటీ నిర్మాణానికి గత ప్రభుత్వం భూములు కేటాయించిందని, అయితే వీటిలో కొన్ని మాత్రమే కార్పొరేట్ ఆసుపత్రుల నిర్మాణాన్ని చేపట్టాయన్నారు. మిగిలిన వారు కూడా ఏడాదిలోగా ఆసుపత్రులు నిర్మించి రోగులకు వైద్య సేవలందించాలని స్పష్టం చేశారు. కింగ్‌జార్జి ఆసుపత్రి (కెజిహెచ్)ని పూర్తి స్థాయిలో ఆధునీకరించనున్నట్టు బాబు తెలిపారు. విశాఖలో రూపుదిద్దుకుంటున్న కేన్సర్ ఆసుపత్రి ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విస్తృత సేవలందనున్నాయన్నారు. ప్రస్తుతం 300 పడకల ఆసుపత్రిగా ఇఎస్‌ఐ ఆసుపత్రిని నిర్మిస్తున్నారని, దీనిని మరింత విస్తరించి 500 పడకలుగా అభివృద్ధి చేయాలని కేంద్ర కార్మికమంత్రి బండారు దత్తాత్రేయను సిఎం చంద్రబాబు అభ్యర్థించారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యులు తమ పనితీరు మార్చుకుని ప్రజలకు సేవలందించేందుకు ముందుకురావాలన్నారు.

చిత్రంవిశాఖలో విమ్స్‌ను ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి
చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రులు వెంకయ్య, దత్తాత్రేయ