ఆంధ్రప్రదేశ్‌

తొమ్మిదికి చేరిన ఎమ్మెల్సీ నామినేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఫిబ్రవరి 16 : చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం పట్ట్భద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల పర్వం ఊపందుకుంది. గురువారం నలుగురు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రస్తుతానికి ఈ సంఖ్య తొమ్మిదికి చేరింది. పట్ట్భద్రుల స్థానానికి చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సికె బాబు అనుచరుడు 16వ డివిజన్ కార్పొరేటర్ పి వెంకటరమణ స్వతంత్ర అభ్యర్థిగా, ప్రస్తుత పట్ట్భద్రుల సిట్టింగ్ ఎమ్మెల్సీ చిత్తూరు జిల్లావాసి అయిన యండపల్లి శ్రీనివాసులరెడ్డి యుటిఎఫ్, ఎస్‌టియి, వామపక్షాల మద్దతుతో తమ నామినేషన్ దాఖలు చేశారు. నెల్లూరు జిల్లా కొండాపురం మండలానికి చెందిన అంకయ్య చౌదరి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఉపాధ్యాయుల స్థానానికి యుటిఎఫ్, ఎస్‌టియు, వామపక్షాల మద్దతుతో సిట్టింగ్ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం నామినేషన్ దాఖలు చేశారు.