ఆంధ్రప్రదేశ్‌

ఎమ్మెల్సీ ఎన్నికలకు మరో రెండు నామినేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, ఫిబ్రవరి 16: పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ, పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు గురువారం రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన వర్న రఘురామయ్య, పట్ట్భద్రుల స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా కర్నూలు జిల్లా మిడుతూరు మండలం నాగలూటి గ్రామానికి చెందిన వై.ఓబులన్న నామినేషన్ వేశారు.
42.60 లక్షల మందికి
ఫిబ్రవరిలో పింఛన్ల పంపిణీ

విజయవాడ, ఫిబ్రవరి 16: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పింఛన్లను ఫిబ్రవరి నెలలో 93.27 శాతం మంది అందుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 45,68,329 మంది పింఛన్ దారులుండగా, వీరి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 490 కోట్లను కేటాయించింది. అయితే ఫిబ్రవరి నెలలో మొత్తం 42,60,748 మందికిగాను రూ. 453.30 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. లబ్ధిదారుల్లో కొంత మంది వేర్వేరు కారణాలతో ఇతర ప్రాంతాల్లో ఉండటం వలన ఈ నెలలో పింఛన్ అందుకోని వారికి వచ్చే నెలలో రెండు నెలల పింఛన్ మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తారు. మొత్తం పింఛన్‌దారుల్లో వృద్ధాప్య పింఛన్లు అందుకుంటున్న వారు 21,77,864 మంది, వితంతు పింఛన్‌దారులు 16,82,455 మంది, వికలాంగు పింఛన్‌దారులు 5,74,657 మంది, చేనేత పింఛన్‌దారులు 77,519 మంది, కల్లుగీత కార్మికులు 16,486 మంది, ఏఆర్టీ పింఛన్‌దారులు 39,348 మంది ఉన్నారు. గత నెలలో మొత్తం పింఛన్‌దారులు 42,74,662 మంది ఉండగా ఆ సంఖ్య ప్రస్తుతం 45,68,329 మందికి చేరింది. జన్మభూమి కార్యక్రమంలో భాగంగా కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం మూడున్నర లక్షల మందికి పింఛన్ పంపిణీ చేసింది. ఇప్పటికే సుమారు 3 లక్షల మందికి కొత్తగా పింఛన్ అందివ్వగా మరికొంత మంది లబ్ధిదారులకు త్వరలో పింఛన్ పంపిణీ చేయనున్నారు. ఇవి కాక చేనేత కార్మికులకు మరో 25వేల మందికి పింఛన్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు.
తమిళనాట బిజెపికి ఎదురు దెబ్బ
సిపిఐ జాతీయ నేత నారాయణ

తిరుపతి, ఫిబ్రవరి 16: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అటు న్యాయవ్యవస్థలను, ఇటు గవర్నర్‌లను తన స్వప్రయోజనాల కోసం వాడు కుంటూ మలినం చేస్తోందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రస్థాయిలో ఆరోపించారు. తిరుపతిలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చాక ఏ రాష్ట్రంలో జరగని విధంగా తమిళనాడులో కొద్ది రోజులపాటు శూన్య పరిస్థితిని కేంద్రం స్వయంగా కల్పించిందన్నారు. జయలలిత మరణం తరువాత ఏఐఏడిఎంకె ఎమ్మెల్యేల మద్దతు శశికళకు ఉన్నా ఆమెకు సిఎం పదవిని దక్కకుండా చేయడానికి కేంద్ర ప్రభుత్వం సర్వ శక్తులను ఒడ్డి భంగపడిందన్నారు. పన్నీరు సెల్వంకు అవకాశం కల్పించి తద్వారా లబ్దిపొందాలని కేంద్రం కుట్రపన్నిందన్నారు. ఇందులో భాగంగానే ఆలస్యంగా రావాల్సిన సుప్రీం కోర్టు తీర్పును త్వరగా వచ్చేలా చేశారని ఆరోపించారు. సుప్రీం కోర్టు తీర్పుకోసమే తమిళనాడు ఇన్‌చార్జ్ గవర్నర్ విద్యాసాగర్‌రావు రాజ్యాంగ విరుద్దంగా బలమున్న శశికళకు అవకాశం ఇవ్వకుండా అడ్డుపడి ఆలస్యం చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. అటు న్యాయవ్యవస్థను నియంత్రిస్తూ, ఇటు గవర్నర్ వ్యవస్థతో తమిళనాట తన రాజకీయ ఆధిపత్యానికి విశ్వప్రయత్నం చేసిందని ఆయన ఆరోపించారు. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన గవర్నర్ వ్యవస్థను కేంద్రం బ్రోకర్ వ్యవస్థగా మారుస్తోందని నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు తమ మ్యానిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని పార్టీల అధినేతలపై చీటింగ్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.
హజ్ ఆపరేటర్ల అధ్యక్షుడిగా ఇలియాస్

విజయవాడ, ఫిబ్రవరి 16: ఆంధ్రప్రదేశ్ హజ్ - వ - ఉమ్రా ప్రైవేట్ ఆపరేటర్స్ రాష్ట్ర అసోసియేషన్ నూతన కార్యవర్గం గురువారం ఏర్పాటయింది. రాష్ట్రం విడిపోయిన తరువాత నూతనంగా ఏర్పాటైన 11 మందితో కూడిన కార్యవర్గంలో కృష్ణాజిల్లాకు 3, మిగతా జిల్లాలకు 8 పదవులు దక్కాయి. వన్‌టౌన్ పాతబస్తీలోని దారుల్ ఉలూం అరబ్బి పాఠశాలలో జరిగిన ఈ ఎన్నిక కార్యక్రమం అసోసియేషన్ వ్యవస్థాపకులు హాఫిజ్ షేక్ ఇలియాస్ అహ్మద్ అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర అధ్యక్షులుగా ఇలియాస్, కార్యదర్శిగా హాజి షేక్ జబ్బార్, కోశాధికారిగా సయ్యద్ జియా సాహెబ్ (విజయవాడ)లు ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా సయ్యద్ సలీం అహ్మద్ బుఖారి (కడప), ఎస్ హమీద్ బాషా (కర్నూలు), మహమ్మద్ తయ్యబ్ (చిత్తూరు), అబ్దుల్ సలాం (వైజాగ్), షేక్ ఖమర్ (గుంటూరు), మహమ్మద్ హనీఫ్ (చిత్తూరు), బిస్మిల్లా టూర్స్ ట్రావెల్స్ (నెల్లూరు), అక్బర్ టూర్ ట్రావెల్స్ (కడప) ఎన్నికైన వారిలో ఉన్నారు. మక్కా యాత్రకు వెళ్లే యాత్రికులకు ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండా ఆపరేటర్లు అనేకానేక జాగ్రత్తలు తీసుకుంటారని, అయినా ఎక్కడెక్కడ తలెత్తే సమస్యలను ప్రభుత్వం త్వరగా పరిష్కరించాలని నూతన కార్యవర్గం ఈ సందర్భంగా కోరింది.

ఆ భూములు మాకే చెందుతాయి
ఉండవల్లి భూములపై దళితుల ఫిర్యాదు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామానికి చెందిన దళితులు, జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండె గురువారం రోజు జాతీయ ఎస్సీ కమిషన్ ముందు హాజరయ్యారు. ఉండవల్లి దళితులకు చెందిన 39.11 ఎకరాల లంక భూములపై తాము లబ్దిదారులమని ఆ భూములు తమకే చెందుతాయని కొంతమంది ఆ భూముల వైపు వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారని జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై గతంలో ఎస్సీ కమిషన్ స్వయంగా జిల్లా కలెక్టర్, దళితులు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో గురువారం ఢిల్లీలోని ఎస్సీ కమిషన్ సభ్యురాలు పిఎం కమలమ్మ ముందు గుంటూరు జిల్లా కలెక్టర్, దళితులు హాజరయ్యారు. అనంతరం తాడేపల్లి మండలం, ఉండవల్లికి చెందిన దళితులు మాట్లాడుతూ దళితుల భూముల్లోకి వెళ్లనీయకుండా అడ్డుకుంటున్న వారిపై కేసులు నమోదు చేయాలని, ఆ భూములలో వేసిన కంచెను తొలగించాలని కమిషన్ ఆదేశించినట్టు తెలిపారు. ఈ ఎస్సీ కమిషన్ సమావేశానికి దళిత నాయకులు మనె్నం సుజాత కిషోర్, కాటూరి శ్రీనివాసరావు, జాలాది నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు.