ఆంధ్రప్రదేశ్‌

ఏడాదిలో నడికుడి-శ్రీకాళహస్తి మొదటి దశ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,్ఫబ్రవరి 17:నడికుడి-శ్రీకాళహస్తి మొదటిదశ 30 కిలోమీటర్ల నూతన ట్రాక్ పనులను 2018 సంవత్సరం మార్చినాటికి పూర్తిచేస్తామని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజరు వినోద్‌కుమార్ యాదవ్ వెల్లడించారు. శుక్రవారం జిల్లా కేంద్రమైన ఒంగోలులోని ప్లాట్‌ఫాం, ఎస్క్‌లేటర్‌ను ఆయన పరిశీలించిన అనంతరం విఐపి లాంజ్‌లో విలేఖర్లతో మాట్లాడారు. విజయవాడ నుండి గుడూరు వరకు మూడవలైను నిర్మాణ పనులను మొదలు పెడుతున్నామని, ఈ పనులు రానున్న మూడేళ్లలో పూర్తిచేస్తామని వెల్లడించారు. 2019 సంవత్సరంనాటికి కాపలాలేని గేట్లను మూసివేసి వాటిస్ధానంలో అండర్‌గ్రౌండ్ బ్రిడ్జిలు, హైలెవల్‌బ్రిడ్జిలను నిర్మిస్తామన్నారు. ప్రయాణికుల భద్రతకు, మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. రైలు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం కల్పించేందుకు కోచ్‌మిత్ర పథకాన్ని ప్రారంభించామన్నారు. రైల్వేల్లో టాయిలెట్స్ సక్రమంగా లేకపోయినా, బల్బులు, ఫ్యాన్లు తిరగకపోయిన వెంటనే ఎస్‌ఎంఎస్ చేస్తే స్పందించి ఆ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఒంగోలులోని అగ్రహరం రైల్వే ఓవర్‌బ్రిడ్జి నిర్మాణపనులను ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఒంగోలు రైల్వేస్టేషన్‌లో జోధ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ను నిలుపుదల చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు.