ఆంధ్రప్రదేశ్‌

నిజమే.. రోజాను ఆహ్వానించాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళా పార్లమెంట్ ఉదంతంపై కోడెల
నా వ్యాఖ్యల వక్రీకరణ దారుణం
వారిపై చర్యలు తప్పవన్న సభాపతి
మార్చి 3నుంచి బడ్జెట్ సమావేశాలు

హైదరాబాద్, ఫిబ్రవరి 19: ఇటీవల జరిగిన జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సుకు వైసీపీ ఎమ్మెల్యే రోజాను ఆహ్వానించిన మాట నిజమేనని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అంగీకరించారు. అయితే సదస్సుకు వస్తున్న రోజాను అడ్డుకుని, అరెస్టు చేసిన వైనంపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. శాసనసభ హైదరాబాద్ నుంచి వెలగపూడికి తరలిస్తున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళా సదస్సు సందర్భంగా విలేఖరుల సమావేశంలో తాను అనని మాటలను అన్నట్లు వక్రీకరించడం తనను బాధించిందన్నారు. దానికి సంబంధించిన వీడియో క్లిప్పింగులను ఆయన మీడియాకు చూపించారు. దానిపై ఏమైనా చర్యలుంటాయా అని ప్రశ్నించగా ‘ఎందుకుండవు? తప్పకుండా ఉంటాయ’న్నారు. కాగా, తనకు 1983 నుంచి హైదరాబాద్‌తో అనుబంధం ఉందని, అది నేటితో తెగిపోతోందని ఒక వైపు బాధ, సొంత రాష్ట్రంలో అసెంబ్లీ నిర్మాణం పూర్తయి, ఇకపై అక్కడే పూర్తి స్థాయి సమావేశాలు జరుగుతాయన్న ఆనందం రెండూ ఉన్నాయన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటివరకూ హైదరాబాద్‌లో మూడు బడ్జెట్, ఒక ఓట్ ఆన్ అకౌంట్ సమావేశాలు నిర్వహించామని వెల్లడించారు. మార్చి తొలివారం నుంచి, బహుశా 3 నుంచి బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశాలున్నాయని వెల్లడించారు.