ఆంధ్రప్రదేశ్‌

పాఠశాలల్లో పూర్తిస్థాయిలో ఇక బయోమెట్రిక్ హాజరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 20: రాష్ట్రంలోని పాఠశాలల్లో మార్చి నాటికి పూర్తిస్థాయిలో బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేయాలని అధికారులను రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. విజయవాడలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈమేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇంటర్, పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ప్రాథమిక విద్యా రంగంలో వినూత్న విధానాలపై చర్చించారు. గిరిజన వర్సిటీ, సెంట్రల్ వర్సిటీల్లో వైఫై సదుపాయాలు, తదితర అంశాలు కూడా చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి. ఈ సమావేశంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదిత్యనాథ్ దాస్, పాండా దాస్, ఉదయలక్ష్మి, సంధ్యారాణి, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.