ఆంధ్రప్రదేశ్‌

రికార్డు స్థాయిలో హంద్రీనీవాకు నీళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందికొట్కూరు, ఫిబ్రవరి 20: శ్రీశైలం జలాశయం జలాశయం నుంచి హంద్రీనీవాకు ఈసారి రికార్డు స్థాయిలో 37 టిఎంసిల నీరు తరలించారు. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 835 అడుగులకు పడిపోవడంతో సోమవారం హంద్రీనీవాకు నీటి తరలింపు నిలిపివేశారు. జలాశయం నుంచి గత ఏడాది ఆగస్టు 7వ తేదీ హంద్రీనీవాకు నీటి తరలింపు ప్రారంభమైంది. కర్నూలు, అనంతపురం జిల్లాలకు రికార్డు స్థాయిలో 37 టిఎంసిల నీటిని తరలించారు. గత ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోకపోవడంతో కేవలం 7.8 టిఎంసిల నీరు మాత్రమే హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా రాయలసీమ జిల్లాలకు తరలించారు. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో హంద్రీనీవా ప్రాజెక్టు కింద నిర్ధేశించిన 1.8 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాల్సి ఉంది. అయితే హంద్రీనీవా కింద రిజర్వాయర్లు ఏర్పాటు చేసినప్పటికీ పంట కాలువలు పూర్తికాకపోవడంతో ఖరీఫ్‌లో ఈ ఏడాది 30 వేల ఎకరాలకు మాత్రమే నీరందించారు.