ఆంధ్రప్రదేశ్‌

జగన్‌ది వారసత్వం కాదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 11: జగన్ రాజకీయాల్లోకి ఎలా వచ్చారు?, వారసత్వంగా వచ్చిన వ్యక్తికాదా? ఆయన ఏం సేవ చేసి వచ్చాడు? వాళ్ల నాన్న పేరు చెప్పుకునే కదా ఓట్లు అడుగుతున్నారు అని ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణనాయుడు ప్రశ్నించారు. సోమవారం ఆయన ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో మాట్లాడుతూ, లోకేష్‌కు మంత్రి పదవి ఇవ్వడం టిడిపి అంతర్గత వ్యవహారమని స్పష్టం చేశారు. దేశంలో వారసత్వ రాజకీయాలు కొనసాగుతున్నాయని, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ లాంటి ఎంతో మంది ఈ విధంగానే రాజకీయాల్లోకి వచ్చారని పేర్కొన్నారు. తెలంగాణలో కూడా వారసత్వ రాజకీయాలున్నాయన్నారు. పార్టీలో కష్టపడుతున్న లోకేష్ మంత్రి అయితే తప్పేమిటని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులకు ఆజ్యం పోసింది కాంగ్రెస్ పార్టీ కాదా? అని నిలదీశారు. సెప్టెంబర్, అక్టోబర్‌లో ఆరు కార్పొరేషన్లకు, ఐదు మున్సిపాల్టీలకు జరిగే ఎన్నికల్లో ప్రజలు ఎటువైపు ఉన్నారో తేలుతుందని, ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసిన ఘనత బొత్స, వైఎస్‌లది కాదా? బొత్స ఏ పార్టీ నుండి ఏ పార్టీలోకి మారారో ప్రజలకు తెలియదా? అని ప్రశ్నించారు. ఆనాడు వైఎస్ కడపలో ప్రభుత్వ ఫంక్షన్లను ప్రైవేటు ఫంక్షన్లుగా మార్చారని అన్నారు. విభజన హామీల అమలుకు ముఖ్యమంత్రి కృషి చేస్తుంటే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని, రాష్ట్భ్రావృద్థి వైకాపాకు పట్టడం లేదని అన్నారు.
హామీల అమలుకు ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీని, రాజ్‌నాథ్ సింగ్‌ను తదితరులను చంద్రబాబు కలిశారని, ప్రత్యేక హోదా, ఇతర హామీలకోసం వైకాపా నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఏమిటో ప్రజలకు చెప్పాలని ముద్దుకృష్ణమనాయుడు నిలదీశారు. రాష్ట్రానికి పలు ప్రాజెక్టులను తీసుకురావడంతో పాటు రెండంకెల అభివృద్ధి రేటు సాధించిన ఘనత చంద్రబాబుదేనని ముద్దుకృష్ణమ నాయుడు పేర్కొన్నారు.