ఆంధ్రప్రదేశ్‌

‘మీ భూమి’కి విశేష ఆదరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 21: భూములకు సంబంధించిన వివరాలను ఇంటి వద్ద నుంచే తెలుసుకునేలా ప్రభుత్వం రూపొందించిన మీ భూమి వెబ్‌సైట్‌కు రైతులు, ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. కోట్లాది మంది ఈ వెబ్‌సైట్‌ను సందర్శించి తమ సమస్యలు నివృత్తి చేసుకుంటున్నారు. గతంలో తమ భూములు, స్థిరాస్తి వివరాలు తెలుసుకోడానికి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఒక్కొక్కప్పుడు రోజులు కూడా గడిచిపోయేవి. రాష్ట్భ్రావృద్ధిలో ఇ పాలనను అమలు చేస్తున్న సిఎం చంద్రబాబు నాయుడు ఈ పరిస్థితి గ్రహించి కాలం వృధాను అరికట్టడమే కాకుండా రెవెన్యూ శాఖ నుంచి పారదర్శక సేవలందించడానికి నిర్ణయించారు. రెవెన్యూ వ్యవస్థలో ఆన్‌లైన్ సేవలకు తెరతీశారు. దీంలో భాగంగా మీ భూమి వెబ్‌సైట్‌ను గతేడాది జూన్ 12 తేదీన అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ వెబ్‌సైట్ ద్వారా ప్రజలు తమ ఇంటి వద్ద నుంచే తమ భూములు, ఇతర స్థిరాస్తి వివరాలు తెలుసుకునే సౌలభ్యం కలిగింది. ఫీడ్ చేసిన వెంటనే తమకు కావాల్సిన వివరాలు కళ్ల ముందు ఆవిష్కరమవుతున్నాయి. ఈ సైట్‌లో 2 కోట్లకు పైగా సర్వే నెంబర్లు, 76 లక్షలకు పైగా పట్టాదారుల వివరాలు పొందుపర్చారు. మీ భూమి సైట్ ద్వారా ఏడు సేవలను పొందే అవకాశం ప్రభుత్వం కల్పించింది. వ్యక్తిగత అడంగల్, 1-బి, ఎఫ్‌ఎంబి, గ్రామ పటం, గ్రామ అడంగల్, గ్రామ 1-బితో ఆధార్ లింకింగ్ చెకింగ్ సేవలు పొందొచ్చు. కేవలం వివరాలు చూసుకోవడమే కాకుండా కావాల్సిన సమాచారం ప్రింట్ కూడా తీసుకొవొచ్చు.
కోటి 74 లక్షల మంది సందర్శన
కాగా గతేడాది జూన్‌లో ప్రారంభమైన మీ భూమి వెబ్‌సైట్‌ను మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల నాటికి 1,74,08,888 మందికిపైగా వీక్షించారు. మీ భూమి సైట్‌లో వ్యక్తిగత అడంగల్, 1-బి, ఎఫ్‌ఎంబి, గ్రామ పటం, గ్రామ అడంగల్, గ్రామ 1-బితోపాటు ఆధార్ లింకింగ్ చెకింగ్ సేవలను వినియోగించుకుంటున్నారు. ఒక్కో వీక్షకుడు ఒకటి అంతకుమించి అంశాలను వినియోగించుకుంటూ లబ్ధి పొందుతున్నారు. ఇలా అత్యధికంగా 47 శాతం మంది అంటే 2 కోట్ల, 2 లక్షల మందికిపైగా మీ అడంగల్ సేవలను పొందారు. దాని తరువాత స్థానం మీ 1-బిది. ఈ సేవలను 28 శాతం మంది అనగా కోటి, 21 లక్షల మందికిపైగా వినియోగించుకున్నారు. ఎఫ్‌ఎంబి సేవలను 52 లక్షల, 56 వేల మంది పొందారు. వారి సేవలు 12 శాతంగా ఉంది. గాలి పటం సేవలను 21 లక్షల, 33వేల మంది, గ్రామ అడంగల్‌ను 20.41 లక్షల మంది. గ్రామ 1 బి సేవలను 7.77 లక్షల మంది. ఆధార్ లింకింగ్ చెకింగ్ సేవలను 6.93 లక్షల మంది సేవలు పొందారు. ఇంటి దగ్గర ఉండే సేవలు పొందే సౌకర్యం ఉండడంతో సులభంగా మీ భూమి వెబ్‌సైట్‌ను వీక్షకులు సందర్శిస్తున్నారు. దీన్ని బట్టి మీ భూమి వెబ్‌సైట్‌కు ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్న విషయం స్పష్టమవుతుంది.