ఆంధ్రప్రదేశ్‌

ఏపి బ్రాండ్ అంబాసిడర్లుగా అజయ్ దేవగన్, కాజోల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 12: బాలీవుడ్ నటులు అజయ్ దేవగన్, కాజోల్ దంపతులను ఏపి టూరిజం బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సుముఖత వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుని విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో అజయ్ దేవగన్ బుధవారం కలిశారు.
ఏపిలో ఎంటర్‌టైన్‌మెంట్, మీడియా, క్రియేటివ్ సిటీ ప్రాజెక్ట్‌లు చేపట్టడానికి అజయ్ దేవగన్ బృందం ప్రతిపాదించింది. అలాగే అత్యంత ఆధునిక లైడార్ టెక్నాలజీ సహాయంతో భూ ఉపరితల ఛాయా చిత్రాలను తీసే ప్రాజెక్ట్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కూడా అజయ్ దేవగన్ ప్రతిపాదించారు.
అలాగే వర్చువల్ టెక్నాలజీ సహాయంతో క్రియేటివ్ స్టూడియో నిర్మాణానికి అజయ్ దేవగన్ ముందుకు వచ్చారు. దీనిపై సిఎం చంద్రబాబు స్పందిస్తూ, ఏపిని విలక్షణమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామని, ఇందుకు అందరూ సహకరించాలని కోరారు. లైడార్ టెక్నాలజీని రాష్ట్రంలోని ఇరిగేషన్, నిర్మాణ రంగ ప్రాజెక్ట్ పనులను పర్యవేక్షించడానికి వినియోగించాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. దీన్ని రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించడానికి సిఎం చంద్రబాబు అంగీకరించారు.

ఏపి టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైన
అజయ్‌దేవగన్‌ను సత్కరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు