ఆంధ్రప్రదేశ్‌

పులిహోరలో ఇసుక, లడ్డూలో రాళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఇంద్రకీలాద్రి), ఫిబ్రవరి 24: విజయవాడలోని శ్రీకనకదుర్గమ్మ మహాప్రసాదాలైన పులిహారలో ఇసుక, లడ్డూలో రాళ్ళు రావటంతో పలువురు భక్తులు కొండపైన ఉన్న దేవస్థాన సమాచార కేంద్రం వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో షుర్షణకు దిగటంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. శుక్రవారం ఉదయం సుమారు 11-30గంటల సమయంలో కొంతమంది భక్తులు సమాచార కేంద్రం వద్దకు వచ్చి వారు కొనుగోలు చేసిన పులిహోరలో కనిపిస్తున్న ఇసుక, లడ్డూలో వచ్చిన చిన్న చిన్న రాళ్ళు, తదితర వాటిని చూపించి ఇదేమి అమ్మవారి ప్రసాదం.. ఈ విధంగా ఉంది.. అంటూ అక్కడ సిబ్బందితో వాదనకు దిగారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఈ విషయాన్ని సంబందింత సెక్షన్ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళతామని చెప్పినప్పటికీ ఆ భక్తులు సంతృప్తి చెందక దీనికి సరైన వివరణ ఇవ్వాలని పట్టుబట్టారు. ఉద్యోగులు, భక్తుల మధ్య వాదోప వాదాలతో గందరగోళ పరిస్థితి నెలకొంది. కనీసం ఫిర్యాదు చేసేందుకు పుస్తకం ఉంటే ఇవ్వండి.
లిఖిత పూర్వకంగా ఫిర్యాదు నమోదు చేస్తాం అని భక్తులు అడిగినా.. పుస్తకం లేదని సిబ్బంది చెప్పారు. ఇవో దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్ళేందుకు భక్తులు ఫోన్ చేసినప్పటికీ ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో చేసేది లేక ఫిర్యాదు చేసేందుకు వచ్చిన భక్తులు వెళ్లిపోయారు.