ఆంధ్రప్రదేశ్‌

108 పుణ్యక్షేత్రాల్లో అంబికా మహాధూపాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఫిబ్రవరి 24 : స్థానిక అంబికా దర్బార్ అగర్‌బత్తి సంస్థ ఏర్పడి 70 సంవత్సరాలు పూర్తిచేసుకుని, 71 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా శుక్రవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని 108 పుణ్యక్షేత్రాల్లో అంబికా మహా ధూపాలను ఏకకాలంలో ఏర్పాటు చేసినట్లు అంబికా దర్బార్ బత్తి అధినేతలు తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగా 24 గంటలపాటు వెలిగే ఈ ధూపాలను వెలిగించామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని స్థానిక అంబికా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అంబికా ప్రసాద్, కృష్ణా జిల్లా బలివేలోని శ్రీ రామలింగేశ్వరస్వామి సన్నిధిలో ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ ఈ భారీ అగరుబత్తిలను వెలిగించారు.

చిత్రం..అంబికా మహా ధూపాన్ని వెలిగిస్తున్న ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్