ఆంధ్రప్రదేశ్‌

విశాఖ మన్యంలో ఎదురు కాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడెంకొత్తవీధి, ఫిబ్రవరి 24: విశాఖ ఏజన్సీ గూడెంకొత్తవీధి- కొయ్యూరు మండలాల్లో శుక్రవారం ఉదయం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈసంఘటనలో మావోయిస్టు కీలక నేత జాంబ్రి, మావోయిస్టు గాలికొండ ఏరియా కమిటీ కమాండర్ చిట్టిబాబు అలియాస్ కిశోర్ మృతిచెందారు. గత కొంత కాలంగా మావోయిస్టు నేత జాంబ్రి కోసం పోలీసులు పలు వ్యూహాలు పన్నినప్పటికీ వీరు పట్టుబడకుండా తప్పించుకున్నారు. అయితే మావోయిస్టు నేత, మరికొందరు గొర్రెలమెట్ట, అన్నవరం అటవీ ప్రాంతంలో తలదాచుకున్నారని తెలుసుకున్న పోలీసులు ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడి చేశారు.
పోలీసుల నుండి తప్పించుకునేందుకు జాంబ్రి, కిశోర్ ఎంత ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. జాంబ్రిపై నాలుగు లక్షల రివార్డు ఉంది. ఇతని గ్రామం గూడెంకొత్తవీధి మండలం మెట్టగూడ. చిట్టిబాబు అలియాస్ కిశోర్ గ్రామం కొయ్యూరు మండలం బాలరేవులు. సంఘటనా స్థలంలో విప్లవ సాహిత్యంతో పాటు రెండు కిట్ బ్యాగ్‌లు, తుపాకులు లభ్యమయ్యాయి.కాగా సరిహద్దు ప్రాంతమైన గొర్రెల మెట్ట సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను తీసుకువచ్చేందుకు పోలీసులు నానా హైరానా పడ్డారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం కావడం, మృతదేహాలను మండల కేంద్రానికి తీసుకురావడానికి పోలీసులు పడ్డ ఇబ్బందులు అన్నీ, ఇన్నీ కావు. కొండ ప్రాంతం నుంచి సుమారు 10 కిలో మీటర్ల దూరం వరకు భుజాలపై శవాలను తీసుకురావడం విశేషం. ఖాకీలు కఠినాత్ములుగా భావించే వారికి ఈదృశ్యం వారి ఔదార్యానికి అద్దం పడుతుంది. కిలోమీటర్ల పొడవునా మృతదేహాలను భుజాలు మార్చుకుంటూ తీసుకు రావడంతో ఆయా ప్రాంతాల వారి కళ్ళు చెమ్మగిల్లాయి. పోలీసులు శత్రువుల శవాలను భుజాలపై తీసుకురావడం అందరినీ కట్టిపడేసింది.

చిత్రం..జాంబ్రి, కిశోర్ మృతదేహాలు