ఆంధ్రప్రదేశ్‌

అత్యున్నత సేవలందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 25: మానసిక వ్యాధిగ్రస్తులకు అత్యున్నత స్థాయిలో ఆరోగ్య వైద్య సేవలందించడం మానసిక వైద్యుల బాధ్యతగా భావించాలని, నానాటికీ తగ్గుతున్న మానసిక వైద్యుల సంఖ్యను పెంచాల్సిన బాధ్యత ఉందని ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ జి రోహిణి అభిప్రాయపడ్డారు. శనివారం విజయవాడలో జరిగిన మానసిక వైద్యుల జాతీయ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన జస్టిస్ జి రోహిణి తెలుగు సాంప్రదాయానికి ప్రతిబింబంగా తొలుత తులసి పూజ చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆంధ్రా, తెలంగాణకు చెందిన మానసిక వైద్యులను ఒకే వేదికపైకి తేవడంలో డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, డాక్టర్ విశాల్‌రెడ్డి ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. భారతదేశంలో మానసిక సమస్యలు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ, దానికి తగ్గట్టుగా మనోవైద్య నిపుణులు, ఇతర మానసిక చికిత్సా నిపుణులు సరిపడా లేరని ఇండియన్ సైక్రియాట్రీ సొసైటీ జాతీయ అధ్యక్షుడు పూనాకు చెందిన డాక్టర్ బ్రిగేడియర్ ఎంఎస్‌వికె రాజు పేర్కొన్నారు. మనదేశంలో కేవలం 5వేల మంది మానసిక వైద్య నిపుణులు మాత్రమే ఉన్నారని, అమెరికాలో భారతీయులైన మానసిక వైద్యులే 10వేలకు మందికి పైగా ఉన్నారని, ఇక్కడ అర్హత పొందిన మానసిక వైద్యులు చాలామంది విదేశాల్లో స్థిరపడుతున్నారని, అక్కడ జీవనశైలి, వసతులు, ఆదాయం మనకంటే బావుంటుంది కాబట్టి ఈ పరిస్థితులు వచ్చాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న కొన్ని చర్యల వల్ల ఇప్పుడిప్పుడే మన దేశంలో కూడా మానసిక వైద్యుల సంఖ్య క్రమంగా పెరుగుతుందని డాక్టర్ రాజు తెలిపారు. రెండు రాష్ట్రాలు విడిపోయిన తరువాత తెలుగు భాషను, సంస్కృతిని పునాదిగా పెట్టి గత రెండు సంవత్సరాలుగా డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, డాక్టర్ విశాల్ దేశంలోని తెలుగు మూలాలున్న మనోవైద్యులందరినీ విజయవాడలో ప్రతి సంవత్సరం ఈ విధంగా కలపడం మంచి పరిణామమని, తెలుగువారందరూ ఈ విధంగా కలుసుకోవడం తెలుగువాడినైన తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఏపి మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ రాజారావు, ఆంధ్రప్రదేశ్ మానసిక వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ కె.నాగిరెడ్డి, తెలంగాణా వైద్యుల సంఘం కార్యదర్శి డాక్టర్ జార్జిరెడ్డి గౌరవ అతిధులుగా పాల్గొన్న ఈ సదస్సుకు ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాల నుండి 200కు పైగా సైకియాట్రిస్టులు, పిజి డాక్టర్లు హాజరయ్యారు. ప్రారంభోత్సవ సభకు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి అధ్యక్షత వహించి అతిథులకు స్వాగతం పలుకగా, కార్యదర్శి డాక్టర్ విశాల్ ఇండ్ల వందన సమర్పణ చేశారు. విశిష్ట సేవలందించిన తెలుగు సైకియాట్రిస్టుకు ఏటా ఇచ్చే లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డును ఈసారి గుంటూరుకు చెందిన డాక్టర్ ఎన్‌వి రమణారావుకు అందజేశారు. ఈ సంవత్సరం విసి రాయ్ అవార్డు అందుకున్న రాజమండ్రికి చెందిన డాక్టర్ కర్రి రామారెడ్డిని కూడా ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. రెండు రోజులు జరిగే ఈ సదస్సులో దేశం నుండి వివిధ ప్రాంతాలకు చెందిన నిష్ణాతులైన సైక్రియాట్రిస్ట్‌లచే ప్రసంగాలతో పాటు రెండోరోజు ప్రముఖ కవి, ప్రవచకులు గరికిపాటి నరసింహారావుచే సాహిత్యంలో మానసిక శాస్త్రం అనే అంశంపైన ఉపన్యాసం ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.

మానసిక వైద్యుల సదస్సులో మాట్లాడుతున్న జస్టిస్ రోహిణి