ఆంధ్రప్రదేశ్‌

పట్టుదారాలతో జాతీయ జెండా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆచంట, ఫిబ్రవరి 26: దేశ సమైక్యత, సమగ్రత ప్రధాన లక్ష్యంగా ఎటువంటి అతుకులు, కుట్లు, అచ్చులు లేకుండా చేనేత మగ్గంపై పట్టుదారాలతో జాతీయ జెండాను తయారుచేస్తున్నాడు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట వేమవరం గ్రామానికి చెందిన రుద్రాక్షల సత్యనారాయణ అనే యువకుడు. మరో వారం రోజుల్లో జెండా నేయడం పూర్తికానుంది. ఆచంట వేమవరం గ్రామం చేనేత కళాకారులకు పుట్టినిల్లు. చేనేత కార్మికుల పనితనాన్ని, వారెదుర్కొంటున్న కష్టాలను జాతికి తెలియజేయాలనే తపనతో సత్యనారాయణ అనే యువకుడు ఎవరూ తయారుచేయలేని విధంగా జాతీయ జెండాను నేయాలని నిశ్చయించుకున్నాడు. కళారంగం పట్ల అభిరుచి ఉన్న సత్యనారాయణ తన స్నేహితుడు గణేష్‌తో కలిసి గతంలో 3లిటిల్ ఇండియన్స్2 అనే షార్ట్ఫిలిం నిర్మించాడు. ఇందులో హిందూ, ముస్లిం, క్రైస్తవుల పిల్లలు ఒక పాఠశాలలో చదువుకుని, అక్కడ జాతీయ జెండాను ఎగురవేయాలన్న కోరికతో ఉంటారు. అయితే స్కూలు యాజమాన్యం వారిని స్కూల్ దగ్గరకు రానీయకపోవడంతో ఆ చిన్నారులు ముగ్గురు కలిసి మూడు రంగులతో జాతీయజెండాను అతుకుతారు. ఈ కథ స్ఫూర్తిగా జాతీయ జెండాలోని మూడు రంగులతో పాటు అశోకచక్రం కూడా ఎటువంటి అతుకులు, కుట్లు లేకుండా, అచ్చులు వేయకుండా చేనేత మగ్గంపై తయారు చేయాలని సత్యనారాయణ భావించాడు. ఏడాది క్రితం ఈ మహత్కార్యానికి నడుంబిగించిన ఆ యువకుడు ముందుగా నాలుగు నెలలు కష్టపడి జాతీయ జెండా గ్రాఫ్ గీసుకున్నాడు. అనంతరం ఆరు అడుగుల పొడవు, నాలుగు అడుగుల వెడల్పుతో జెండాను నేయడం ప్రారంభించాడు. దేశమాతను స్మరిస్తూ ప్రశాంతంగా జెండాను నేసేవాడినని సత్యనారాయణ తెలిపాడు. మూడు రంగులతో జెండాను నేసేటప్పుడు పెద్ద ఇబ్బందిలేదుకాని అశోకచక్రం నేసేటప్పుడు చాలా జాగ్రత్తగా నేయవలసి వచ్చేదని తెలిపాడు. ఇప్పటివరకు అశోకచక్రంతో పాటు 5అడుగుల జెండా పూర్తయ్యిందని, మరో వారం రోజుల్లో జెండా పూర్తవుతుందని తెలిపారు. దీనితో పాటు మరో మూడు జెండాలను తయారుచేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, ప్రధాని నరేంద్రమోదీకి ఇవ్వాలనే కోరిక ఉందని సత్యనారాయణ తెలిపాడు.
రాజధాని ఢిల్లీ ఎర్రకోటపై ఎగరేసే జెండాను కూడా నేయాలన్న ఆలోచన ఉందని, అయితే అర్థికంగా అంత స్థోమత లేదని, అంత పెద్ద జెండా నేసేందుకు తగిన స్థలం కూడా లేదని తెలిపాడు. ప్రభుత్వం ఆర్థికంగా సహాయం అందిస్తే ఎర్రకోటపై జెండాను కూడా తయారు చేస్తానని సత్యనారాయణ తెలిపారు. మిత్రుడు గణేశ్, మేనల్లుడు మల్లికార్జునరావు జెండా నేయడంలో ఎంతగానో సహకరించారని సత్యనారాయణ తెలిపారు. ఈ జెండాలను చూసి ప్రభుత్వాలు స్పందించి చేనేత రంగాన్ని ఆదుకుంటే తాను పడిన శ్రమను మరచిపోతానని సత్యనారాయణ తెలిపారు.

చిత్రం..మగ్గంపై పట్టు దారాలతో జాతీయ జెండాను నేస్తున్న సత్యనారాయణ