ఆంధ్రప్రదేశ్‌

‘డిజి’ లావాదేవీలు ఢమాల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 26: డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా, నగదు లావాదేవీల వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్‌లో నగదు అందుబాటులో ఉండటంతో డిజిటల్ లావాదేవీల సంఖ్య తగ్గుతోంది. జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో డిజిటల్ లావాదేవీలు తగ్గినట్లు రిజర్వు బ్యాంక్ లెక్కలే చెపుతున్నాయి. నవంబర్‌లో పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రజల వద్ద పెద్దనోట్లు ఉన్నా అవి చిత్తుకాగితాలుగా మిగలడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బ్యాంకులు, ఎటిఎంలలో నగదు ఉపసంహరణపై పరిమితుల ఆంక్షలు ఉండటంతో ప్రజలు తప్పనిసరిగా ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారించారు. ఈ దశలో నగదు రహిత లావాదేవీలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దాదాపు 25 శాతం వరకూ నగదు రహిత లావాదేవీలు చేసే స్థాయికి వెళ్లింది. విద్యార్థులతో ప్రచారం, ప్రతిరోజూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష, డిజిటల్ లావాదేవీలపై సర్వీస్ చార్జి మినహాయింపు వంటి చర్యలు తీసుకున్నారు. ఈ చర్యలు డిజిటల్ లావాదేవీల పెంపునకు ఊతమిచ్చాయి. ‘ఎపి పర్స్’ అనే యాప్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ప్రస్తుతం లక్షకు పైగా డౌన్‌లోడ్లతో 3.2 స్టార్ రేటింగ్‌తో ఈ యాప్ కొనసాగుతోంది. ఇప్పటికి డౌన్‌లోడ్ల సంఖ్య మరింగా పెరగాల్సి ఉన్నా దానిలో పెద్దగా మార్పులేకపోవడం కూడా డిజిటల్ లావాదేవీలపై ప్రజల ఆసక్తిని తెలియచెబుతోంది. పెద్ద దుకాణాల్లో ఇ-పోస్ యంత్రాలు ఏర్పాటు చేసే ప్రయత్నం జరిగింది. రిజర్వు బాంక్ లెక్కల ప్రకారం గత ఏడాది నవంబర్‌లో 675.5 మిలియన్ల లావాదేవీలు జరగ్గా, డిసెంబర్‌లో 957.5 మిలియన్లు జరిగాయి. ఈ ఏడాది జనవరిలో 870.4 మిలియన్లు, ఫిబ్రవరి 19 వరకూ 537.5 మిలియన్ల లావాదేవీలు జరిగాయి. గత ఏడాది డిసెంబర్‌తో పోలిస్తే జనవరిలో 87.1 మిలియన్ల మేర లావాదేవీల్లో తగ్గుదల చూడవచ్చు. ఫిబ్రవరిలో కూడా 795 మిలియన్ల లావాదేవీలు జరగవచ్చని అంచనా. జనవరి నుంచి డిజిటల్ లావాదేవీలు తగ్గుముఖం పడుతున్నాయి. నగదు ఉపసంహరణ పరిమితిలో సడలింపుల వల్ల మార్కెట్‌లో నగదు అందుబాటులో ఉంటోంది. తిరిగి సాధారణ పరిస్థితి నెలకొంది. పెద్దనోట్ల రద్దు తొలినాళ్లలో పెట్రోల్ బంకుల్లో ఎక్కువ శాతం లావాదేవీలు డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా జరిగాయి. నోట్ల రద్దుకు ముందు పెట్రోల్ కొనుగోళ్లకు సంబంధించి నగదు రహిత లావాదేవీలు గరిష్ఠంగా 10 శాతం ఉండగా, తరువాతి కాలంలో 60 శాతానికి చేరాయి. కానీ ప్రస్తుతం 40 శాతానికి పడిపోయాయి. రాష్ట్రంలో చౌకధరల దుకాణాల్లో రేషన్‌ను పూర్తిస్థాయిలో నగదు రహిత లావాదేవీలతో నిర్వహించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా, కృష్ణా మినహా మిగిలిన జిల్లాల్లో పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలు ఆధార్‌తో అనుసంధానం కాకపోవడం, డీలర్ల ఖాతాలు కూడా అనుసంధానం కాకపోవడం, సాఫ్ట్‌వేర్, సర్వర్ సమస్యలతో ఇది పూర్తిగా అమల్లోకి రాలేదు. ఏప్రిల్ ఒకటి నుంచి పూర్తిగా నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలన్న ప్రభుత్వ లక్ష్యం కష్టసాధ్యంగా మారింది. పెద్దనోట్ల రద్దు తరువాత వివిధ దుకాణాల వద్దకు అధికారులు వెళ్లి ఈ-పోస్ యంత్రాలు ఏర్పాటు చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారు. కానీ నగదు సమస్యగా అంతగా ప్రస్తుతం లేకపోవడంతో అధికారులు దానిపై పెద్దగా దృష్టిసారించడం లేదు. నగదు రహిత లావాదేవీలపై సర్వీస్ చార్జి వసూలు వంటివి ఉండటంతో డిజిటల్ లావాదేవీలపై ప్రజలు అంతగా ఆసక్తి చూపడం లేదు. నాటి పరిస్థితి ఇప్పుడు లేకపోవడంతో ప్రజలు మెలమెల్లగా తిరిగి నగదు లావాదేవీల వైపు మళ్లుతున్నారు.