ఆంధ్రప్రదేశ్‌

శ్రీశైలంలో ఘనంగా పూర్ణాహుతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, ఫిబ్రవరి 26: ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో ఆదివారం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ముగింపు సూచకంగా ఉదయం యాగశాలలో చండీశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే అర్చక వేదపండితులు దేవస్థానం ఇఓ నారాయణ భరత్‌గుప్తా చేతుల మీదుగా యాగశాలలో పూర్ణాహుతి ద్రవ్యాలను యజ్ఞ వాటికలో సమర్పించారు. ఇందులో భాగంగా పూర్ణాహుతి ద్రవ్యాలను యజ్ఞ గుండంలోకి ఆహుతిగా సమర్పించి అనంతరం కలశంలోని జలాలను స్వామి వారి గర్భాలయం చుట్టూ ప్రదక్షిణ గావించి చండీశ్వరునికి సరస్వతి అంతర్వాహిని వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ చండీశ్వరునికి స్నానం గావించిన అనంతరం కలశంలోని మంత్ర పూరిత జలాన్ని ఆలయ అర్చకులు అధికారులు, భక్తులకు సంప్రోక్షించారు. సాయంత్రం ధ్వజస్తంభానికి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ప్రారంభ సూచికగా సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ఎగురవేసిన ధ్వజ పతాకాన్ని ధ్వజావరోహణ గావించారు. కాగా సోమవారం స్వామి అమ్మవార్లకు అశ్వవాహనసేవ, పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంత సేవ నిర్వహిస్తారు. ఆయా కార్యక్రమాలతో శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.