ఆంధ్రప్రదేశ్‌

‘వెనె్నలకంటి’కి ‘బెజవాడ’ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు టౌన్, ఫిబ్రవరి 26: నగరంలోని టౌన్‌హాల్‌లో ఆదివారం డాక్టర్ బెజవాడ గోపాల్‌రెడ్డి అవార్డు పురస్కారాన్ని సినీపాటల రచయిత వెనె్నలకంటి రాజేంద్రప్రసాద్‌కు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మాజీ ఎమ్మెల్యే, సిఆర్‌డిఎ సభ్యులు బీద మస్తాన్‌రావు, సింగీతం శ్రీనివాసరావు, భువనచంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా వెనె్నలకంటి మాట్లాడుతూ, ఈ అవార్డు పురస్కారం తనకు అందజేసినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. డాక్టర్ బెజవాడ గోపాల్‌రెడ్డితో ఉన్న అనుబంధమే తనకు ఈ అవార్డు రావటానికి దోహదపడిందన్నారు. మూడు వేల పాటలు రచించి, మూడు వందల రచనలను ఇతర భాషాల్లోకి అనువాదం చేసిన ఘనత కూడా ఆయనదేనని ఎమ్మెల్యే రవిచంద్ర అన్నారు. అనంతరం సింగీతం శ్రీనివాసరావు, భువనచంద్ర మాట్లాడుతూ, వెనె్నలకంటి సర్వసాధారణమైన వ్యక్తి అని అన్నారు. పరిశ్రమలో అందరితో కలిసిపోయే మనస్తత్వం కలవాడని పేర్కొన్నారు. అనంతరం ఆయనను, ఆయన సతీమణి ప్రమీలను ఘనంగా సత్కరించి, బెజవాడ గోపాల్‌రెడ్డి పురస్కారాన్ని అందజేశారు.