ఆంధ్రప్రదేశ్‌

హిందూ మతం జోలికి రావద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 26: హిందువులను, హిందూ మతాన్ని కించపరిచే విధంగా చాలా మంది చేస్తున్న వ్యాఖ్యలను ఇకపై మానుకోవాలని కాకినాడ శ్రీ పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి హితవు పలికారు. స్థానిక బివికె కాలేజీ 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం పూర్వ విద్యార్థుల, ఆచార్యుల సమ్మేళనం ఇక్కడ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన పరిపూర్ణనంద స్వామి మాట్లాడుతూ హిందూ మత విశ్వాసాల గురించి అన్యులెవ్వరూ మాట్లానక్కర్లేదని అన్నారు. నాస్తికులు, కమ్యూనిస్టులు హిందూమతాన్ని చులకన చేసి మాట్లాడ్డం సరికాదని అన్నారు. బివి రాఘవులు హైందవుడని ఒప్పుకుంటేనే హిందూ మతం గురించి మాట్లాడాలని సూచించారు. ఎవరికి ఇష్టమైన మతాన్ని వారు స్వీకరించవచ్చని రాజ్యాంగంలో పొందుపరచబడి ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అందువలన హిందువులను హిందువులుగానే బతకనీయాలని పరిపూర్ణానంద అన్నారు. వకుళ మాత ఆలయ నిర్మాణానికి మార్చి అయిదో తేదీ ఉదయం 7.50 శంకుస్థాపన పేరూరులో జరుగుతుందని తెలిపారు. భాగ్యలక్ష్మి ఆలయ నిర్మాణం కూడా త్వరలోనే పూర్తవుతుందని ఆయన చెప్పారు. దయానంద సరస్వతి ఆలోచనా విధానాలకు అనుగుణంగా రాష్ట్రంలో ప్రతి జిల్లాలో 1000 సంధ్యా గురుకులాలు ఏర్పాటు చేయనున్నామని, తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటికే 300 గురుకులాలు ప్రారంభమయ్యాయని పరిపూర్ణానంద చెప్పారు.

చిత్రం..కార్యక్రమంలో మాట్లాడుతున్న పరిపూర్ణానంద స్వామి