ఆంధ్రప్రదేశ్‌

ప్రశాంతంగా గ్రూప్-2 పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 26: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 స్క్రీనింగ్ పరీక్ష పకడ్బందీ ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా జరిగింది. తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో సహా రాష్ట్రంలో మొత్తం 1462 పరీక్ష కేంద్రాలు ఏర్పాటయ్యాయి. మొత్తం 6,47,010 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 4,83,321 మంది (73.50 శాతం) అభ్యర్థులు హాజరయ్యారు. పలు కారణాలతో నిర్ణీత సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోలేనివారు ఎన్నో ఇక్కట్ల పాలయ్యారు. 15 నిముషాలు ముందుగా చేరుకున్నవారిని సైతం కొన్ని కేంద్రాల్లో సిబ్బంది లోపలికి అనుమతించలేదు. కొన్నిచోట్ల మానవతా దృక్పథంతో అనుమతించడం కనిపించింది. సుదూర ప్రాంతాల నుంచి బస్సులు, ఇతర ప్రైవేట్ వాహనాల్లో తరలివచ్చిన వారు ఉరుకులు, పరుగులతో పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ఒక్క నిముషం ఆలస్యం కావటంతో విజయవాడలోని శారదా కళాశాల పరీక్ష కేంద్రంలో ఐదుగురు అభ్యర్థులను అధికారులు గేటు బయటే నిలిపివేశారు. దీంతో వారు కన్నీటి పర్యంతమయ్యారు. ఎపిపిఎస్‌సి చైర్మన్ ఉదయకుమార్ ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షించారు. ప్రతి జిల్లాలోనూ కలెక్టర్, ఎస్పీ, రెవెన్యూ డివిజన్‌లలో సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలు పర్యవేక్షించారు. రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. కృష్ణా జిల్లాలో 52,257 మంది అభ్యర్థులకు గాను 37,806 (72.35 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు.
విశాఖలో ...
విశాఖపట్నం బ్యూరో: ఎపిపిఎస్‌సి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన గ్రూపు-2 పరీక్ష విశాఖ జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. జిల్లావ్యాప్తంగా 182 పరీక్షా కేంద్రాల్లో 74,536 మంది విద్యార్థులు పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, వీరిలో 20వేల మంది పరీక్షకు గైర్హాజరు అయినట్టు జిల్లా అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులు ఉదయం 9.45 గంటలకు మాత్రమే అనుమతించడంతో పదుల సంఖ్యలో అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో వీరంతా వెనుదిరగాల్సి వచ్చింది. పరీక్షల ఏర్పాటుకు సంబంధించి ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ పరీక్షా కేంద్రాలను పరిశీలించారు.

చిత్రం..విజయవాడలో పరీక్ష కేంద్రం వద్ద తన చిన్నారితో ఓ అభ్యర్థిని