ఆంధ్రప్రదేశ్‌

వైకాపా, టిడిపి సిగపట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, ఫిబ్రవరి 27: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపధ్యంలో కడప జిల్లాలో సోమవారం ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎర్రగుంట్ల మున్సిపాలిటీ 17వ వార్డు కౌన్సిలర్ దివ్య తండ్రి ఎరికలరెడ్డి, కడప కార్పొరేటర్ సురేష్‌ను తీసుకెళ్లే వ్యవహారంలో టిడిపి, వైకాపా నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని పరస్పరం దాడికి దిగారు. టిడిపి అభ్యర్థి బిటెక్ రవీంద్రారెడ్డి, వైసిపి ఎమ్మెల్సీ వైఎస్ వివేకానందరెడ్డి నామినేషన్ల సందర్భంగా ప్రొద్దుటూరు, కడపలో ఇరుపక్షాల నేతలు పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేసుకున్నారు. ఎర్రగుంట్లలో రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్‌నాయుడు, జమ్మలమడుగు ఎమ్మెల్యే సి.ఆదినారాయణరెడ్డి 17 వ వార్డుకు చెందిన కౌన్సిలర్ దివ్య తండ్రి ఎరికలరెడ్డిని వెంట తీసుకువెళ్లే ప్రయత్నం చేయగా వైకాపా ఎంపి వైఎస్ అవినాష్‌రెడ్డి, జమ్మలమడుగు ఇన్‌చార్జి డాక్టర్ సుధీర్‌రెడ్డి అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. కడప కార్పొరేటర్ పాకా సురేష్ ఇటీవల టిడిపిలో చేరి తిరిగి వైకాపాలోకి అడుగుపెట్టడంతో ఆయనపై టిడిపి నేతలు సోమవారం దాడిచేసి టిడిపిలోకి రావాలని హుకుం జారీ చేసినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ అభ్యర్థి బికెట్ రవీంద్రారెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులరెడ్డి ప్రమేయం ఉందని మేయర్ కె.సురేష్‌బాబు పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది.