ఆంధ్రప్రదేశ్‌

అసెంబ్లీకి ఆ మకిలి అంటవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తమ పార్టీ నుంచి ఎన్నికై టిడిపిలో చేరిన 21 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని, అటువంటి వారిని కొత్త అసెంబ్లీ భవనంలోకి అనుమతించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పీకర్ కోడెల శివప్రసాద రావును కోరారు. ఈ మేరకు స్పీకర్‌కు లేఖ రాశారని ఆ లేఖ ప్రతిని హైదరాబాద్‌లో వైకాపా ఎమ్మెల్యేలు వై. విశే్వశ్వర్ రెడ్డి, సురేష్ విడుదల చేశారు.
‘అమరావతిలో తాత్కాలిక అసెంబ్లీలోకి వెళ్ళబోతున్న ఈ సమయంలో, ఎమ్మెల్యేలు కొత్త ఇంటిలోకి కాలు పెడుతున్న ఈ శుభ సందర్భంలో, ఇందుకు దారితీసిన పరిస్థితులన మీకు గుర్తు చేస్తున్నాను, ఏపి ఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు, తెలంగాణ అసెంబ్లీలోని ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో, వీడియో సాక్ష్యాలతో సహా అడ్డంగా దొరికిపోవడం వల్లే హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్ళే ప్రక్రియ ఇంత వేగంగా జరిగిన విషయం మీకు తెలుసు. తన పార్టీకి చెందని ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం దొంగతనమే కదా?, హైదరాబాద్‌లో అసెంబ్లీ ఉండగా ఆయన చేసిన మరో దొంగతనం మా పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలకు తన పార్టీ కండువాలు కప్పటం, ఇందు కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం, ఈ 21 మంది ఎమ్మెల్యేలు రాజ్యాంగం ప్రకారం దొంగ సొత్తే. వీరిని అనర్హులుగా ప్రకటించండి అని ఏనాడో అడిగినా ఇంత వరకు మీరు నిర్ణయం తీసుకోకపోవడం గానీ, వారిని సభలో అనుమతించడం గానీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. ఒక దొంగతనంలో దొరికి హైదరాబాద్ అసెంబ్లీ ఖాళీ చేసిన సిఎం చంద్రబాబు రెండో దొంగతనం సొత్తుతో అమరావతిలోని కొత్త అసెంబ్లీలోకి ప్రవేశించకుండా నిరోధించడం అన్నది ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. ఇది రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, స్పీకర్ పదవికి ఉన్న గౌరవం దృష్ట్యా మీ బాధ్యత. మీ బాధ్యతను తక్షణం మీరు నిర్వర్తించి, పార్టీ మారిన 21 మంది వైకాపా ఎమ్మెల్యేలను అనర్హులుగా చేసి కొత్త రాజధానిలో కొత్త సభకు మకిలి అంటకుండా ఆపాలని ఈ బహిరంగ లేఖ ద్వారా కోరుతున్నాం. మీరు ఎంత తెలుగు దేశం పార్టీకి చెందిన శాసనసభ్యులైనా, రాజ్యాంగానికి, ప్రజల తీర్పుకు గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నాం’.
సష్మా స్వరాజ్‌కు జగన్ లేఖ
అమెరికాలోని ఎన్నాఐల రక్షణకు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ జగన్ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు లేఖ రాశారు. ప్రధాని లేదా సుష్మా స్వరాజ్ నేతృత్వంలో ఉన్నత స్థాయి బృందం అమెరికా వెళ్ళాలని, అక్కడి ప్రవాస భారతీయుల్లో నెలకొన్న అభద్రతా భావాన్ని తొలగించాలని కోరారు.