ఆంధ్రప్రదేశ్‌

ప్రజల సూచనలు పరిగణనలోకి తీసుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఫిబ్రవరి 27: ప్రజల నుంచి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ జి.్భవానీ ప్రసాద్ అన్నారు. సోమవారం ఇక్కడ విద్యుత్ భవన్‌లో నిర్వహించిన బహిరంగ విచారణలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం మొదటి ఏడాది 4 శాతం, రెండో ఏడాది 3.5 శాతం ప్రజలపై విద్యుత్ భారం పడిందన్నారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో కూడా లోటును భర్తీ చేసేందుకు నియంత్రణ మండలి ఏ దిశగా వెళ్తే బాగుంటుందనే విషయమై బహిరంగ విచారణ నిర్వహించినట్టు ఆయన వివరించారు. రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉండగా, ప్రైవేటు సంస్థల నుంచి అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం ఏముందని ఆయనను అడగ్గా గతంలో జరిగిన ఒప్పందాల మేరకు కొనుగోలు చేస్తున్నారన్నారు. గత 15-20 ఏళ్ల క్రితం చేసుకున్న ఒప్పందాల ఫలితంగా నేడు ఆ విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నారన్నారు. ఇపుడు చౌకగా విద్యుత్ లభిస్తున్నా అప్పటి ఒప్పందం మేరకు అధికంగా కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. గతంలో కుదుర్చుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పిపిఎ)లో మార్పుల గురించి అడగ్గా అది తన పరిధిలో లేదని పేర్కొన్నారు. సమావేశంలో ఎపిఇపిడిసిఎల్ చైర్మన్ ఎంఎం నాయక్, ఎపిఇఆర్‌సి సభ్యులు డాక్టర్ పి.రఘ, పి.రామమోహన్, కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. సోమవారం ఇక్కడ విద్యుత్ భవన్‌లో ఎపి విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ జి.్భవానీ ప్రసాద్ ఆధ్వర్యంలో బహిరంగ విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఎపిఇపిడిసిఎల్ సిఎండి ఎం.ఎం.నాయక్ మాట్లాడుతూ వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాబడికి, ఖర్చుకు మధ్య వ్యత్యాసం రూ.1331 కోట్ల లోటు ఉందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ కొనుగోలు ఖర్చు రూ.6812 కోట్లు కాగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.8194 కోట్లు ఖర్చు కాగలదని అంచనా వేశారు. దీనిలో ట్రాన్స్‌మిషన్ ఖర్చు రూ.441 కోట్లు, పంపిణీ ఖర్చు రూ.1523 కోట్లు కాగలదని అంచనా వేశామన్నారు. వీటితోపాటు వినియోగదారుల సెక్యూరిటీ మీద వడ్డి రూ.99 కోట్లు, సరఫరా మార్జిన్ రూ.6కోట్లు, ఇతర రకాలు రూ.218 కోట్లు కలిపి మొత్తం రూ.10481 కోట్లు ఖర్చు కాగలదని ప్రతిపాదించారు. ప్రస్తుత ధరల వద్ద రాబడి రూ.8894 కోట్లు ఉందన్నారు.