ఆంధ్రప్రదేశ్‌

ఎపిలో పెరిగిన మెడికల్ పిజి సీట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 27: నవ్యాంధ్రలో మెడికల్ పిజి సీట్లు పెరిగాయి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం మేరకు పిజి విభాగంలో 25 సీట్లు పెరిగాయి. మెడికల్ సీట్ల భర్తీకి సంబందించి కేంద్రం నిర్వహించే పరీక్ష ద్వారా వీటిని భర్తీ చేస్తారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సుమారు 2,700 వరకూ మెడికల్ పిజి సీట్లు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో పలు మెడికల్ పిజి కళాశాలలు సీట్ల పెంపునకు సంబంధించి చేసుకున్న దరఖాస్తులను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసిఐ) పరిశీలించి, అర్హతలను గుర్తించిన మీదట సీట్ల పెంపునకు అనుమతించింది. వచ్చే విద్యా సంవత్సరం (2017-18) నుంచి పెరిగిన సీట్లు అందుబాటులోకి వస్తాయి. శ్రీకాకుళం జిల్లా రాగోలులోని దగ్రేట్ ఈస్ట్రన్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ఎంపి జనరల్ సర్జరీ, ఎండి గైనకాలజీ, ఎండి అనస్థీషియా, ఎండి కమ్యూనిటీ డిసీజస్, ఎండి ఫ్యామిలీ మెడిసిన్, ఎండి ఫిజియాలజీతో పాటు ఎంఎస్ ఆర్థోలో సీట్లను పెంచుతూ ఎంసిఐ ఆమోదం తెలిపింది. ఎంఎస్ ఆఫ్తమాలజీలో పిజి సీట్లకు సంబంధించిన దరఖాస్తును తిరస్కరించింది. గుంటూరుకు చెందిన ఎన్‌ఆర్‌ఐ కళాశాల ఎండి ఫ్యామిలీ మెడిసిన్ పిజి సీట్లను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు మెడికల్ కళాశాల ఎండి పలమనరీ మెడిసిన్ పిజి సీట్ల పెంపు దరఖాస్తును తిరస్కరించింది. ఇప్పుడు పెరిగిన సీట్ల సంఖ్య స్వల్పమే అయినప్పటికీ భవిష్యత్‌లో వీటి సంఖ్య మరింత పెరుగుతుందని ఎపి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎథిక్స్ కమిటీ ప్రతినిధి పివి సుధాకర్ తెలిపారు.