ఆంధ్రప్రదేశ్‌

వచ్చే బడ్జెట్‌లో రూ. 100 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 27: బ్రాహ్మణ కార్పొరేషన్‌కు వచ్చే బడ్జెట్‌లో రూ. 100 కోట్ల నిధులు కేటాయించాల్సిందిగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు కార్పొరేషన్ ఎండి చెంగపల్లి వెంకట్ తెలిపారు. దీనివల్ల నేరుగా 50వేల కుటుంబాలకు ఆర్థిక చేయూత అందించాలనేది తమ లక్ష్యంగా చెప్పారు. సోమవారం గుంటూరు జిల్లా బ్రాహ్మణపరిషత్ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ 2015-16 సంవత్సరానికి 35 కోట్లు కేటాయించగా 11వేల 107 మంది, ఈ ఏడాది 65 కోట్లకు గాను 34వేల 880 మందికి ప్రయోజనం కల్పించామన్నారు. ప్రభుత్వం అందించే బడ్జెట్‌కు మూడింతల ఫలితం సాధించే దిశగా కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. తొలిసారిగా బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్రంలోనే ఏర్పాటయిందని గుర్తుచేశారు. బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోందని తెలిపారు. కార్పొరేషన్ నిర్వహణ ఖర్చులకు కేవలం 5 శాతం మాత్రమే కేటాయిస్తున్నట్లు వివరించారు. జిల్లా, నియోజకవర్గాల స్థాయిలో కో ఆర్డినేటర్లను నియమించి ప్రతి రూపాయి అర్హులకు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించడం వల్ల అవినీతికి తావులేదన్నారు.కార్పొరేషన్‌కు మూలధనం కింద మరో 70 కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామన్నారు.