ఆంధ్రప్రదేశ్‌

నేటి నుంచి విశ్వ సమైక్యతా వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 28: గుంటూరుజిల్లా చినకోండ్రుపాడు విశ్వనగర్‌లో బుధవారం నుంచి విశ్వశాంతి సమైక్యతా వేడుకలు జరగనున్నాయి. ప్రతిరోజు గణపతి హోమం, ఏకాదశ రుద్ర పారాయణ, విశిష్ట పూజలు, ప్రత్యేక హోమాలు, పూజాది కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక ప్రదర్శనలు, విశిష్ట వ్యక్తులకు సత్కారాలను నిర్వహిస్తారు. ఈనెల 5వ తేదీన విశ్వగురు పీఠాధిపతి విశ్వయోగి విశ్వంజీ మహరాజ్ 73వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఐదురోజుల పాటు ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గత నాలుగు దశాబ్దాలుగా విశ్వమానవ సంఘటితం.. ప్రపంచ శాంతి కోసం విశ్వంజీ భక్తజనకోటిని జాగృతం చేస్తున్నారు. ప్రధానంగా సనాతన ధర్మ ప్రచారంతో సర్వ మానవాళి హితాన్ని కాంక్షిస్తూ దిశ, నిర్దేశం చేస్తున్నారు. వ్యక్తి సంస్కరణ..సమాజ సంస్కరణతో ప్రపంచశాంతి సాధ్యపడుతుందనేది స్వామీజీ ప్రధాన ప్రవచనం. హైందవ సనాతన ధర్మాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్తూ అందుకు అవసరమైన శక్తిని అందిస్తున్నారు. విశ్వశాంతి సమైక్యతా వేడుకలలో భాగంగా ఈనెల 3వ తేదీన ఉదయం 8 నుండి 11 గంటల వరకు ప్రముఖ నేత్రవైద్యులు ఎం.శ్రీధర్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర పరీక్షలు నిర్వహిస్తారు. 4న థైరాయిడ్ బాధితులకు గుంటూరు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్యామల అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 5న సాయంత్రం 6.30 గంటలకు మాతా-శిశు వైద్యశాల వార్షికోత్సవ సభ సందర్భంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వైస్ ఛాన్స్‌లర్ రవిరాజ్ అధ్యక్షతన మాతా శిశు ఆరోగ్య పరిరక్షణ- విశ్వవికాసం అనే అంశంపై చర్చాగోష్టి ఉంటుంది. ముఖ్య, విశిష్ట అతిథులుగా ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, సిద్ధా రాఘవరావు, ఏపి, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి అంబటి శంకరనారాయణ, ఎంపి రాయపాటి సాంబశివరావు తదితర ప్రముఖులు హాజరు కానున్నారు. ప్రముఖ గుండె మార్పిడి శస్త్ర చికిత్స నిపుణులు పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే తో పాటు పలువురు వైద్యులను స్వామీజీ సత్కరిస్తారు. రాత్రి 8.30 గంటలకు విశ్వంజీ జన్మదినోత్సవ సందేశమిస్తారు.