ఆంధ్రప్రదేశ్‌

విభజన సమయంలో చాలా బాధపడ్డా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 2: రాష్ట్ర అసెంబ్లీ భవనాల ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం భావోద్వేగానికి గురైయ్యారు. రాష్ట్ర విభజన జరిగిన తీరును గుర్తు చేసుకుని ఉగ్వేదానికి లోనయ్యారు. పార్లమెంట్‌లో రాష్ట్ర విభజన జరిగిన తీరు సమయంలో బాధ పడిన విధంగా తన జీవితంలో మరెప్పుడూ బాధపడలేదన్నారు. పార్లమెంట్‌లో రాష్ట్ర విభజన బిల్లు ప్రవేశపెడుతున్న సమయంలో తాను బిజెపి అగ్రనేత అద్వానీతో ఉన్నానని తెలిపారు. ఇంతలో ఒకరు చీటి తీసుకుని వచ్చారని, అందులో రాష్ట్ర విభజన బిల్లును ప్రవేశపెడుతున్నారని, ప్రత్యక్ష ప్రసారం నిలిపివేశారని, తలుపులు మూసి వేశారని పేర్కొన్నారని వివరించారు. ఇది ఏమి అన్యాయమని అద్వానీని అడిగానని, పెద్దమనిషిగా చెప్పాలని కోరానన్నారు. అరగంటలో బిల్లు ప్రవేశపెట్టి పాస్ చేయడం, రాష్ట్రానికి అన్యాయం జరగడం పూర్తయిందన్నారు. ఆరోజు చాలా బాధపడ్డానంటూ ఉద్వేగంగా మాట్లాడారు. అయితే ఆ కసి, కోపం తగ్గడానికి వీలు లేదన్నారు. ప్రజల సెంటిమెంట్‌తో ఆడుకోవద్దని చెప్పానని, సమస్యలు వస్తాయని చెప్పానన్నారు. అవమానం, ఆవేశం తగ్గించుకోకూడదని, అన్యాయం చేసిన వాళ్లు బాధపడేలా తెలుగుజాతి శక్తి నిరూపిస్తానని ఆనాడే చెప్పానని తెలిపారు. దేశ చరిత్రను తిరగరాసే విధంగా అమరావతి నగరం ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలుస్తుందన్నారు. కాగా రాష్ట్భ్రావృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నానని సిఎం తెలిపారు. గడ్డకట్టే చలి కాలంలో నిర్వహించే దావోస్ సదస్సుకు ఇబ్బంది పడినా హజరయ్యాయని గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర ఉన్నతాధికారి రావత్ మంచు కారణంగా జారి కాలు విరిగి శస్త్ర చికిత్స చేయించుకున్నారని, కేరళ సిఎం కూడా జారి పడి శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు.