ఆంధ్రప్రదేశ్‌

ఫలించిన మంత్రాంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మార్చి 3: తొలి నుంచి హైడ్రామాలతో ఆరంభమైన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక, నామినేషన్, ఏకగ్రీవం అంతా నేరుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడే అమరావతి నుంచి మోనటరింగ్ చేయడంతో శుక్రవారం బరిలో ఉన్న ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు వారి నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో టిడిపి అభ్యర్థి, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు ఏకగ్రీవంగా శ్రీకాకుళం స్థానిక సంస్థల కోటా నుంచి పెద్దల సభకు అడుగుపెట్టే అవకాశం కలిగింది. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి చక్రధర్‌బాబుకు ఇండిపెండెంటు అభ్యర్థులైన మామిడి శ్రీకాంత్, శోభన్‌బాబు వారి నామినేషన్లు ఉపసంహరించుకుంటున్నట్టు చెప్పడంతో టిడిపి నుంచి నామినేషన్ దాఖలు చేసిన శత్రుచర్ల విజయరామరాజు ఒక్కరే బరిలో ఉండంతో ఆయన విజయం దాదాపుగా ఖరారైనట్టే. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో నాలుగు నియోజకవర్గాల్లో పూర్తి బలం కలిగిన శత్రుచర్లను వైకాపా నేతలు బొత్స సత్యన్నారాయణ, ధర్మాన ప్రసాదరావు ఏకగ్రీవం కాకుండా రచించిన వ్యూహం బెడిసికొట్టింది. ప్రత్యర్థి బలహీనతపై దెబ్బకొట్టడం రాజకీయాల్లో ఒక ఫార్ములా. ఇదే ఫార్ములాతో అధినేత చంద్రబాబునాయుడు నుంచి జిల్లా నేతలు కింజరాపు అచ్చెన్నాయుడు, కూన రవికుమార్, కళా వెంకటరావు స్వతంత్య్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మామిడి శ్రీకాంత్‌పై సామదాన భేద దండోపాయాలు ప్రయోగించి చివరకు సింగిల్ నామినేషన్ శత్రుచర్లది నిలిచేలా వ్యూహం రచించారు. ఏదిఏమైనా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక నుంచి ఏకగ్రీవం చేసేవరకూ వివిధ పరిణామాలు విపక్షాలపై ముప్పెటదాడి వంటి కార్యక్రమాలతో విజయరామరాజును పెద్దలసభకు పంపేలా కృషి చేసారు. బి.్ఫరం ఇచ్చే సమయంలో నడిచిన హైడ్రామా ఏకగ్రీవం వరకూ సాగింది. దీనికి ఇక్కడ నేతలు పావులుగా మిగిలారే తప్ప కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అంతా అమరావతి నుంచి బాబే నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి నల్లాది కిరణ్‌కుమార్‌రెడ్డి అప్పటి పిసిసి చీఫ్ బొత్స సత్యన్నారాయణపై అక్కసుతో మద్యం సిండికేట్లపై ఎసిబి దాడులు చేయించడం ఇందులో బినామీలుగా ఉన్న వ్యక్తులపై కేసులు నమోదు చేయడం వంటి అంశాలు స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో దిగిన బొత్స బంధువు మామిడి శ్రీకాంత్‌ను నామినేషన్ ఉపసంహరించుకునేలా ఆయన భాగస్వామ్యులే అంగీకరిస్తున్నారు. కేసులు తిరగతోడుతామని, నిబంధనలకు విరుద్ధంగా గొలుసు దుకాణాలు, నాన్-డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్మకాలపై తనిఖీలు అంటూ మామిడి శ్రీకాంత్ భాగస్వామ్య వ్యాపారం కలిగిన షాపులను ఎక్సైజ్ అధికారులు గురువారం రాత్రికిరాత్రి సీజ్ చేసారు. అంతేకాకుండా, ఆయన వ్యాపార లావాదేవీలు, ఆర్థిక మూలాలపై ప్రభుత్వం కనె్నర్ర చేస్తుందని ప్రభుత్వ విప్ కూన రవికుమార్ అల్టిమేటం ఇచ్చినట్టు నామినేషన్ ఉపసంహరణ చేసిన మామిడి శ్రీకాంత్ ‘ఆంధ్రభూమి’కి చెప్పారు. ఇలాంటి బెదిరింపుల మధ్య ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా తనచే నామినేషన్ ఉపసంహరణకు ఒత్తిడి పెంచారని ఆరోపించారు.