ఆంధ్రప్రదేశ్‌

వెలగపూడిలో అసెంబ్లీ వెలుగులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 4: వెలగపూడిలోని తాత్కాలిక ప్రభుత్వ భవనాల సముదాయంలో అసెంబ్లీ, శాసనమండలి భవన నిర్మాణం రికార్డు సమయంలో 192 రోజుల్లో పూర్తిచేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, స్పీకర్ కోడెల శివప్రసాదరావు, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ సూచనలతో ఏపి సిఆర్‌డిఎ అధికారులు అత్యంత వేగంగా నిర్మాణం పూర్తిచేశారు. ఏపి సిఆర్‌డిఎ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీ్ధర్ మార్గదర్శకత్వంలో అదనపు కమిషనర్ డాక్టర్ ఎ.మల్లికార్జున ప్రత్యక్ష పర్యవేక్షణలో ఏపి సిఆర్‌డిఎ సిఈలు జయరామిరెడ్డి, షుకూర్, ఎస్‌ఈ మాదాసు జక్రయ్య, డిఈ కొండారెడ్డి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మురళి పనులు నిర్ణీత కాలంలో చురుగ్గా చేయించారు. వందల మంది కార్మికులు, డజన్ల మంది ఇంజనీర్లు కొత్త భవన నిర్మాణం కోసం అహోరాత్రులు పనిచేశారు. అందులో పాలుపంచుకున్న ఇంజనీర్లు చెప్పిన వివరాలు వారి మాటల్లోనే...
నాణ్యతా ప్రమాణాలు, పనుల్లో వేగం లక్ష్యంతో ముందుకు సాగాం: ఎస్‌ఈ మాదాసు జక్రయ్య
ముఖ్యమంత్రి లక్ష్యం మేరకు ఒక టార్గెట్‌తో నిరంతరం పరిశ్రమించాం. సెలవులు లేకుండా రాత్రి, పగలు తేడా లేకుండా సైట్‌లో విధుల్లో పాల్గొన్నాం. కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీ్ధర్ ఆదేశాల మేరకు అదనపు కమిషనర్ డాక్టర్ ఎ.మల్లికార్జున ప్రత్యక్ష పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు ఇస్తున్న సూచనలు పాటిస్తూ పనులు జరిపించాం. సిఈలు ఇచ్చిన గైడెన్స్‌తో ఇతర అధికారులను సమన్వయం చేసుకుంటూ వేగంగా పనులు చేయించాం. నాణ్యతలో రాజీ లేకుండా కాంట్రాక్టు సంస్థ వారికి ఎప్పటిప్పుడు తగిన సూచనలు ఇస్తూ అప్రమత్తం చేస్తూ ముందుకు సాగాం. కొంత ఒత్తిడికి గురైనప్పటికీ రికార్డు సమయంలో అసెంబ్లీ, శాసనమండలి భవనం పూర్తి చేయించడం ఆనందంగా ఉంది.
నిర్ణీత సమయం ప్రకారం
వేగంగా పనులు: డిఈ కొండారెడ్డి
అసెంబ్లీ, శాసనమండలి భవనం నిర్మాణంలో పై అధికారుల ఆదేశాల మేరకు అవిశ్రాంతంగా పనిచేశాం. సిఈ, ఎస్‌ఈ ఆదేశాల ప్రకారం వర్క్ జరిపించాం. కింది స్థాయి సిబ్బందిని, వర్కర్లను సమన్వయం చేసుకుంటూ పని చురుగ్గా చేయించాం. రికార్డు సమయంలో పనులు పూర్తికావడం సంతోషం కలిగించింది.
ఎప్పటికప్పుడు వర్కర్లను అప్రమత్తం చేశాం:
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మురళి
ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం పనులు చేయించాం. సైట్‌లో వర్కర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ పనులు వేగంగా చేయించాం. జాగ్రత్తగా పనులు చేయాలని సూచిస్తూ ముందుకు సాగాం. ఒక క్రమపద్ధతిలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ, గైడెన్స్‌లో పనులు జరిపించాం. సమయం చూసుకోకుండా పనిచేశాం. రికార్డు సమయంలో అసెంబ్లీ భవనం పనులు పూర్తి చేయించడంలో భాగస్వాములు కావడం ఆనందంగా ఉంది.
భవన నిర్మాణం ఇలా పూర్తయింది!
* అసెంబ్లీ, శాసనమండలి భవనాల టార్గెట్ 192 రోజులు
* 18-02-2016న అసెంబ్లీ, శాసన మండలి భవనం పనులు ప్రారంభం
* 1-03-2017న అన్ని హంగులతో అసెంబ్లీ, శాసన మండలి భవనం సిద్ధం
* 28 మీటర్ల నుంచి 33 మీటర్ల లోతు వరకు పైల్స్ వేశారు. 209 పైల్స్
* అవి వేయడానికి హెవీ డ్యూటీ రిగ్ మిషన్స్ వాడారు
* 28 రోజుల్లో ఫైల్స్ అన్నీ పూర్తయ్యాయి
* ఫౌండేషన్ దశలో భద్రతాపరంగా జాగ్రత్తలు తీసుకున్నారు. బారికేడింగ్ ఆఫ్ బిల్డింగ్, సైనేజెస్, క్వాలిఫైడ్ పర్సన్ సూపర్‌విజన్, డేంజర్ లైట్స్ ఏర్పాటు, అంబులెన్స్, ఫస్ట్‌ఎయిడ్ సెంటర్ ఏర్పాటు
* ఫస్ట్ స్లాబ్ సెంట్రింగ్ వర్క్ 14 రోజుల్లో పూర్తి చేశారు.
* ఫస్ట్ స్లాబ్ 15-9-2016న వేశారు
* సెకండ్ స్లాబ్ సెంట్రింగ్ వర్క్ 14 రోజుల్లో పూర్తి చేశారు
* సెకండ్ స్లాబ్ 29-9-2016న వేశారు
* బ్రిక్ వర్క్ 20 రోజుల్లో, ప్లాస్టరింగ్ వర్క్ 20 రోజుల్లో, 90 రోజుల్లో భవనం స్ట్రక్చర్ మొత్తం పూర్తి చేశారు.
* 12-10-2016న ఇంటీరియర్ వర్క్ ప్రారంభం
* ఇంటీరియర్ ప్రత్యేకతలు స్పెషలైజ్డ్ ఆర్కిటెక్చర్‌తో క్వాలిటీ డిజైన్ ఎలక్ట్రికల్ వర్క్స్, లైటింగ్ ప్రత్యేకతలు. సెన్సర్ లైట్లు, ఎనర్జీ ఎపీషియన్సీ లైట్లు, సేఫిక్సర్స్, మెయిన్ పవర్ ఆఫ్ అయినా యుపిఎస్ సిస్టం రెడీ
* అసెంబ్లీ, శాసనమండలి హాళ్లు, ఎమ్మెల్యే లాబీలో 700 ఆర్కిటెక్చరల్ ఫిటింగ్ ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు, భవనంలోని మిగతా భాగంలో, ఆవరణలో మొత్తం 1075 డౌన్‌లైటర్ ఎల్‌ఈడి బల్బులు ఏర్పాటు
* సెంట్రలైజ్డ్ ఏసీ స్పెషాలిటీ - హీటింగ్ వెంటిలేషన్ (హెచ్‌వి) ఏసీ
* ఫర్నీచర్ ప్రత్యేకతలు - ట్రెడిషనల్, లేపాక్షి డిజైన్, అడ్వాన్స్‌డ్ గోద్రేజ్ ఫర్నీచర్
* వీడియో, ఆడియో వ్యవస్థ ప్రత్యేకతలు - అత్యాధునిక జర్మనీ టెక్నాలజీ
* మైక్స్ - అసెంబ్లీలో 182, శాసనమండలిలో 69, స్పేర్-4
* బిఎంఎస్, ఐబిఎంఎస్ ప్రత్యేకతలు - సెంట్రలైజ్డ్ కంట్రోల్ మానటరింగ్ బై చీఫ్ మార్షల్
* కాన్ఫరెన్స్ హాలు ఆడియో, వీడియో సిస్టంతో ఏర్పాటు
* 20 ఎంఎం మందం ఉన్న కార్పెట్ సౌదీ అరేబియా నుంచి దిగుమతి
* అసెంబ్లీ హాలులో 231 సీట్లు, శాసనమండలిలో 90 సీట్లు
* అసెంబ్లీ స్పీకర్ పోడియం - శాసన మండలి చైర్మన్ పోడియం స్పెషాలిటీ- వెల్ లెవల్ నుంచి 1.5 మీటర్ల ఎత్తు ఉంటుంది. టేకు ఉడ్‌తో విశాలంగా అందంగా తీర్చిదిద్దారు.
* సీట్లు క్వాలిటీ - లేపాక్షి డిజైన్‌తో సీట్లు తయారీ
* అవి ముందుకు, వెనుకకు జరిగే వెసులుబాటు, సౌండ్ రియాక్షన్ లేని విధంగా ఎకో సిస్టంతో సీలింగ్ ఏర్పాటు
బిల్డింగ్ మేనేజ్‌మెంట్ సిస్టం విశేషాలు...
* అన్ని వ్యవస్థలను ఒకేచోట నుంచి మానిటర్ చేసే విధానం
* పబ్లిక్ అడ్రస్ సిస్టం
* డాటా సిస్టం ఇంటర్నెట్ సౌకర్యం, అసెంబ్లీ, శాసనమండలి హాలులో మినహా మిగిలిన ప్రాంతాల్లో వైఫై సౌకర్యం
* వీడియో కాన్ఫరెన్స్ విధానం
* యాక్సెస్ కంట్రోల్ సిస్టం
* అత్యాధునిక సెక్యూరిటీ వ్యవస్థ
* డైనింగ్ హాలులో అత్యాధునిక గోద్రేజ్ ఫర్నీచర్ వాడకం
* లేటెస్ట్ ఫైర్‌ఫైటింగ్ వ్యవస్థ ఏర్పాటు
* ఆధునిక డెస్క్‌లు
* అత్యాధునిక సిసి కెమెరాలు ఏర్పాటు, డోర్ కెమెరా వన్ బైత్రీ పిక్సల్ 20మీటర్ల కవరేజీ, బుల్లెట్ కెమెరా 2మెగా పిక్సల్, 20 మీటర్ల కవరేజీ, పీటీజడ్ 360 డిగ్రీల కెమెరా 2 మెగా పిక్సల్ 20మీటర్ల కవరేజి.

చిత్రం..అమరావతిలో రికార్డు సమయంలో పూర్తయన అసెంబ్లీ భవనాలు