ఆంధ్రప్రదేశ్‌

బస్సు ఆపరేటర్లతో త్వరలో భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 6: రాష్ట్రంలో జరుగుతున్న రహదారి ప్రమాదాలు, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు గురించి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు రవాణాశాఖ ఉన్నతాధికారులతో సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో పెద్దఎత్తున చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాలకు అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, నిద్రలేమి, రోడ్డు ఇంజనీరింగ్ లోపాలు కారణమన్నారు. ప్రమాదాలను నివారించడానికై ఈ నెల 10వ తేదీన కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సు ఆపరేటర్లు, లారీ ఓనర్ల అసోసియేషన్స్‌తో సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రహదారుల మీద జరుగుతున్న ప్రమాదాల నియంత్రణకు గాను కొన్ని సూచనలను, సలహాలను సోమవారం జరిగిన సమీక్షలో అందజేశారు. వీటిపై కూలంకుషమైన చర్చల తరువాత కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు.
వాహనా వేగాన్ని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న స్పీడ్ గవర్నర్ల విధానాన్ని తక్షణమే అమలు చేయవలసిందిగా అధికారులను ఆదేశించారు. వచ్చే 30 రోజుల్లో రవాణా వాహన యజమానులందరూ తమ వాహనాలకు స్పీడ్ గవర్నర్లు అమర్చుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వ టెస్టింగ్ ఏజెన్సీలు ధ్రువీకరించిన ఏదైనా కంపెనీ స్పీడ్ గవర్నర్ పరికరాన్ని వాహనానికి అమల్చుకోవాలన్నారు. పాత వాహనాలు కూడా స్పీడ్ గవర్నర్‌లు విధిగా అమర్చుకోవాలని, అక్టోబర్ 1, 2015 తరువాత కంపెనీలు విడుదల చేసిన కొత్త వాహనాలతో అమర్చబడిన స్పీడ్ గవర్నర్లు సక్రమంగా పని చేస్తున్నాయా లేదో తనిఖీ చేయవల్సిందిగా కోరారు. ఈ నిబంధనలను పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా పబ్లిక్ సర్వీస్ వాహనాలు అయిన కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులు 30 రోజుల్లోగా జిపిఎస్ (వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్)ను కూడా అమర్చుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. జిపిఎస్ పరికరాన్ని వాహనానికి అమర్చుకోవడం వల్ల రవాణాశాఖ నిరంతరం వాహనాన్ని ట్రాకింగ్ చేసే అవకాశం ఉంటుందన్నారు. మహిళల భద్రతకు కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులు, టూరిస్ట్ బస్సులు మీద నిరంతరం నిఘా ఉంచవల్సిందిగా రవాణాశాఖ అధికారులను ఆదేశించారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో సైన్ బోర్డుల ఏర్పాటు చేయడం, ప్రమాదాలకు కారణమవుతున్న బ్లాక్ స్పాట్స్‌ని రిపేరు చేయడం, రోడ్డు ఇంజనీరింగ్ లోపాలను సరిదిద్దడంతో పాటుగా రవాణా, పోలీసుశాఖ వారు సంయుక్తంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ చేపట్టవలసిందిగా కోరారు. కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులలో విధిగా ఇద్దరు డ్రైవర్లను ఉంచాలన్న నిబంధనలను కఠినతరం చేయాలన్నారు. నిబంధనలను పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా రవాణాశాఖ అధికారులను ఆదేశించారు.