ఆంధ్రప్రదేశ్‌

ముదిరిన వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మార్చి 6 : పశ్చిమగోదావరి జిల్లాలో కలెక్టర్ కాటంనేని భాస్కర్, రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎల్‌వి సాగర్ మధ్య రగడ చినికి చినికి గాలివానగా మారుతూవస్తోంది. ఒకరు ఉద్యమం పేరుతో రంగంలోకి దిగుతుంటే, మరొకరు ఆరోపణలు వచ్చాయంటూ విచారణలకు ఆదేశించడం ఆ తర్వాత సినీ ఫక్కీలో పరిణామాలు మారుతూ వస్తున్నాయి. సోమవారం ఈ వ్యవహారం పూర్తి స్థాయిలో రోడ్డున పడింది. ఉద్యోగ సంఘ నేత సాగర్ సోమవారం విలేఖరుల సమావేశం ఏర్పాటుచేసి కలెక్టర్‌పై తీవ్రస్థాయిలోనే నిప్పులు చెరిగారు. నేరుగా కలెక్టర్‌ను ఉద్దేశించి పలు విమర్శలు, ఆరోపణలుచేశారు. ఆయన వ్యవహారశైలితో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమించిన కారణంగానే తనను లక్ష్యంగా చేసుకుని చర్యలు తీసుకుంటున్నారని, ఈ విషయంలో ఎంత దూరమైనా వెళ్లేందుకు తాను సిద్ధమని ఆయన చెప్పారు. తాను నిమ్నజాతికి చెందిన ఉద్యోగి అయినందున, సంఘ నేతగా కలెక్టర్‌ను ప్రశ్నిస్తున్న కారణంగానే తనను లక్ష్యం చేస్తున్నారంటూ ఆయన తీవ్రస్థాయిలో ఆరోపించారు. జిల్లాలో గత కొంతకాలంగా ఉద్యోగ సంఘ నేత ఎల్‌వి సాగర్, కలెక్టర్ కాటంనేని భాస్కర్ మధ్య వివాదం నడుస్తూనే వుంది. ఇంతకుముందు కలెక్టర్ వ్యవహార శైలి పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఉద్యోగ సంఘాలు ఆందోళనకు దిగాయి. ఆ సమయంలో జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని వ్యవహారాన్ని చక్కదిద్దారు. ఇటీవల వీరి మధ్య వివాదం మరోసారి రోడ్డున పడింది. పరిపాలన పేరుతో ఉద్యోగులు, అధికారులను వేధిస్తున్నారంటూ రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వర్క్ టు రూల్ ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో కొంతమంది తహసీల్దార్లు కలెక్టర్‌కు అనుకూలంగా వ్యవహరించడంతో ఆ ఉద్యమం అనుకున్న స్థాయిలో ముందుకు వెళ్లలేదు. చివరకు దాన్ని వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితిని అసోసియేషన్ ఎదుర్కొంది. ఉద్యోగ సంఘ నేత ఎల్‌వి సాగర్ ఏలూరు తహసీల్దార్ కార్యాలయంలో సివిల్ సప్లయిస్ డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్నారు. రెండ్రోజుల క్రితం ఏలూరు మండల పరిధిలోని పలువురు రేషన్ షాపు డీలర్లు జిల్లా కలెక్టర్ వద్దకు వెళ్లి తమను సాగర్ దుర్భాషలాడుతూ డబ్బులు కోసం బెదిరిస్తున్నారని ఫిర్యాదుచేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ఏలూరు ఆర్డీవో ఆధ్వర్యంలో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని జెసి కోటేశ్వరరావును ఆదేశించారు. దీంతో మరోసారి వీరిమధ్యవున్న వ్యవహారం పతాక స్థాయికి చేరినట్లు కనిపించింది. ఈ నేపథ్యంలోనే సోమవారం సాగర్ స్థానిక పెన్షనర్స్ హాలులో రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజులపాటి గంగాధరరావు, డీలర్లతో కలిసి విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటుచేశారు. కలెక్టర్‌పై సాగర్ తీవ్రస్థాయిలోనే విరుచుకుపడ్డారు. కలెక్టర్ తనను లక్ష్యం చేసుకుని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్ విభజించి పాలించు అన్న సూత్రాన్ని కలెక్టర్ పాటిస్తున్నారని, కులాల భావన అన్ని చోట్లా తీసుకువస్తున్నారని ఆరోపించారు. రాజులపాటి మాట్లాడుతూ కలెక్టర్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసిన వారిలో చాలామంది బినామీ డీలర్లని ఆరోపించారు.