ఆంధ్రప్రదేశ్‌

ప్యాకేజీకి చట్టబద్ధతే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 6: రాష్ట్ర ప్రభుత్వ దిశ, దశలను ప్రస్తావిస్తూ సాగిన గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ స్ఫూర్తివంతమైన ప్రసంగంతో కొత్త రాజధానిలో అందునా కొత్త ప్రాంగణంలో చారిత్రాత్మకమైన శాసనసభ బడ్జెట్ సమావేశాలు సోమవారం విజయవంతంగా ప్రారంభమయ్యాయి. విభజనాంతరం ఎదురైన సవాళ్లను ప్రస్తావిస్తూ ఎదురైన సంక్షోభం నుంచి అవకాశాలను ఏ విధంగా అందిపుచ్చుకున్నామో వివరిస్తూ 50 నిమిషాల పాటు ఏకబిగిన సాగిన ప్రసంగం ద్వారా గవర్నర్ తమ ప్రభుత్వ గమ్యాన్ని సుస్పష్టంగా వివరించారు. శాసన సభాధినేత కోడెల శివప్రసాదరావు, శాసన మండలి చైర్మన్ చక్రపాణి, గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, సిఎం చంద్రబాబు నాయుడు సభలోకి ప్రవేశించిన అనంతరం 11 గంటల 6 నిమిషాల సుమూహర్తాన జాతీయ గీతాలాపన అనంతరం గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా చేపట్టిన కొన్ని ముఖ్య కార్యక్రమాలను ప్రస్తావించినప్పుడల్లా అధికార పక్ష సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ కరతాళ ధ్వనులు చేశారు. ప్రధానంగా రాష్ట్ర శాసనసభకు, లోక్‌సభకు ఏకకాలంలో ఎన్నికలు జరగాలని, ఆ తర్వాత ఏడాదిలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగాలని గవర్నర్ అభిప్రాయపడ్డారు. నియోజకవర్గాలు 175 నుంచి 225 పెంపునకు కేంద్రంతో సంప్రదింపులు జరుగుతున్నాయని అన్నారు. ప్రత్యేక హోదా ఇక ఏ రాష్ట్రానికీ లేదు.. అయితే ప్రత్యేక ప్యాకేజీ చట్టబద్ధత సాధన అంతిమ లక్ష్యమన్నారు. అవినీతి అనేది ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన విఘాతం కల్పంచే సమస్య మాత్రమే కాకుండా సామాజిక ఆస్థిరతకు కారణమవుతుందంటూ అవినీతిపై పోరాడేందుకు డిజిటల్ టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నామన్నారు.
టీ అడిగిన గవర్నర్..ఇవ్వలేకపోయామన్న యనమల
రాష్ట్ర విభజన తర్వాత రికార్డు సమయంలో కొత్తగా నిర్మితమైన శాసనసభ ప్రాంగణంలో జరుగుతున్న తొలి సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి తాను ప్రసంగిస్తుండటం తనకెంతో సంతోషంగా ఉందని, ఏది ఏమైనా ఈ సుదినం చరిత్రలో చిరస్థాయిగా నిలువగలదంటూ ఉభయ సభలను ఉద్దేశించి ప్రారంభించిన ప్రసంగంలో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ఎంతో ఉత్సాహంగా అన్నారు. ఆంగ్ల భాషలో తన ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్ తెలుగు భాషలో ముగించారు. ప్రభుత్వం వాగ్దానాలన్నింటినీ నెరవేర్చడానికి కట్టుబడి ఉందన్నారు. ప్రసంగం ముగిసిన తర్వాత తాను వెళ్లే సమయంలో గవర్నర్ నరసింహన్ తనకు టీ కావాలని కోరారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు టీ ఇచ్చే సంప్రదాయం లేదని కానీ కోరితే మాత్రం వెంటనే సమకూర్చుతామని చెప్పారు. ఇంతలో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు లేచి బడ్జెట్ చాలా తక్కువగా ఉందని అందుకే టీ అరేంజ్ చేయలేకపోయామని అనటంతో గవర్నర్‌తో పాటు సభ మొత్తం ఒక్కసారిగా నవ్వులతో నిండిపోయింది.