ఆంధ్రప్రదేశ్‌

గోదావరి బేసిన్ ఆధునికీకరణ ఎక్కడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మార్చి 6: గోదావరి బేసిన్‌లో డెల్టా ఆధునికీకరణ పనులు డోలాయమానంగా తయారయ్యాయి. ఏటికేడాది గడిచిపోతున్నా పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడ చందంగా ఉంటున్నాయి. 2007లో మంజూరైన ఈ పనులు ఒక అడుగు ముందుకేస్తే రెండడుగులు వెనక్కి అన్నట్టుగా వుంది. లక్ష్యానికి దూరంగా పనులు సాగుతూనేవున్నాయి. ఆధునీకరణ ఫలితాలు మాత్రం రైతులకు దక్కడంలేదు. రాష్టవ్య్రాప్తంగా ప్రస్తుతంవున్న వ్యవస్థలు ఆధునీకరించడానికి చర్యలు చేపట్టారు. తరచూ తుపానులు సంభవించినందున పంటలకు నష్టం వాటిల్లడం వల్ల రూ.15000 కోట్లతో కృష్ణా, గోదావరి, ఏలేరు, పెన్నా డెల్టాలు, నాగార్జున సాగర్, నాగావళి నదీ వ్యవస్థ, నాగార్జున సాగర్ తదితర ప్రాజెక్టుల ఆధునీకరణకు రూపకల్పన చేశారు. 46.36 లక్షల ఎకరాల ప్రస్తుత ఆయకట్టు వ్యవస్థను స్థిరీకరించడానికి ఆధునికీకరణ పనులు 2007లో రూపొందించారు. ఈక్రమంలో గోదావరి బేసిన్ పరిధిలోని 10,38,362 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే డెల్టా వ్యవస్థను ఆధునికీకరించడానికి రూ.3,361 కోట్లతో పనులు రూపొందించారు. అప్పట్లో ఈ పనులను పెద్ద పెద్ద ప్యాకేజీలుగా రూపొందించడంతో అనేకసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. నిపుణుల కమిటీ క్షేత్ర స్థాయి అధ్యయనం మేరకు ప్యాకేజీలన్నీ రద్దుచేసి అత్యవసర ప్రాధాన్యత క్రమంలో ఏటికేడాది పనులు చేపడుతూనే వున్నారు. ఈ పనులు నేటికీ ఒక కొలిక్కి రాలేదు. ఎప్పటికపుడు పనులు చేపట్టడం, అవి ఆ మరుసటి ఏడాదికి మళ్లీ మొదటికి రావడం ఇలా కొత్త పనులు రూపొందించే సరికి గతంలో చేపట్టిన పనులు మళ్ళీ మొదటికి రావడంతో కోట్ల నిధులు కాలువలో పోసిన పన్నీరుగా మారుతున్నాయి. అత్యవసర ప్రాధాన్యత పనులను ఒకే ఏడాది పూర్తిచేస్తే ఆధునికీకరణ ఫలితాలు రైతులకు చేరేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా 67,614 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు ఏలేరు ఆధునికీకరణను రూ.138 కోట్లతో చేపట్టారు. ఈ పనులు కూడా జరుగుతూనే వున్నాయి. ఒకవైపు ఆధునికీకరణ పనులు, మరోవైపు నీరు చెట్టు పథకంలో, ఇంకొక వైపు నిర్వహణ పనులకు ఏటికేడాది ప్రతిపాదనలు పంపిస్తూనేవున్నారు. కొన్ని పనులు చేపట్టడం, ఆ మరుసటి ఏడాది మిగిలిపోయిన పనులతో కొత్తగా మంజూరైన పనులను కలిపి చేపట్టడం ఇలా ఆధునికీకరణ ప్రహసనంగా సాగుతూనే వున్నాయి. ఒకేసారి చేపట్టకపోవడం వల్ల ఆశించిన ఫలితాలు రైతులకు దక్కడంలేదని తెలుస్తోంది. గోదావరి డెల్టాల ఆధునికీకరణకు 2014లో రూ.716 కోట్ల విలువైన పనులకు ఆమోదం లభించింది. ఈ పనులు ఎంతవరకు వచ్చాయో అతీగతీ లేదు. తాజాగా ఈ ఏడాది 348 పనులను రూ.170 కోట్లతో చేపట్టనున్నారు. నీరు చెట్టు పధకంలో రూ.124 కోట్ల విలువైన పనులను ప్రతిపాదించారు. తూర్పు డెల్టా పరిధిలో గత ఏడాది చేపట్టగా మిగిలిపోయిన రూ.10.81 కోట్ల విలువైన 34 పనులతో పాటు ఈ ఏడాది మంజూరైన రూ.33.87 కోట్ల విలువైన 36 పనులను చేపడుతున్నారు. 214 పనులను రూ.46.3 కోట్లతో చేపట్టేందుకు ప్రతిపాదనలు పంపించారు. లాకుల షట్టర్లు మార్చడం, కాల్వల పూడిక తొలగింపు, స్లూరుూస్‌లు, రెగ్యులేటర్ల మరమ్మతులు వంటి పనులు చేపడుతున్నారు. 2015లో రూ.30 కోట్లతో పనులు చేపట్టారు. ఇప్పటికి 50 శాతం పనులు పూర్తయ్యాయి. జల వనరుల శాఖ హెడ్ వర్క్సులో బ్యారేజి ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. జూన్ నాటికి 80 శాతం పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంకా ఎన్పో పనులు కొనసాగుతున్నాయి.