ఆంధ్రప్రదేశ్‌

లోకేష్ ఆస్తులు ఇవీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 7: తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీగా ఎన్నికైన నారా లోకేష్ పేరుమీద ఉన్న ఆస్తుల విలువ రూ.217 కోట్లుగా తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తన పేరుమీద హెరిటేజ్ షేర్లు, ఇతర ఆస్తుల విలువ రూ.217 కోట్లు ఉన్నట్లు అసెంబ్లీకి సమర్పించిన అఫిడవిట్‌లోవెల్లడించారు. తన స్తిరాస్తుల విలువ రూ.9.95 కోట్లుగా వ్యవహరించారు. భార్య నారా బ్రాహ్మణి పేరు మీద రూ.17.90 కోట్లు విలువ చేసే షేర్లు ఉన్నట్లు ప్రకటించారు. భార్య స్థిరాస్థుల విలువ రూ.4.45 కోట్లు, తనయుడు దేవాంశ్ పేరుమీద రూ.2.70 కోట్లు విలువ ఉన్న షేర్లు, అతడి స్థిరాస్థులు రూ.9.60 కోట్లు విలువ ఉన్నట్లు ఆయన తన అఫిడవిట్‌లో స్పష్టం చేశారు. కాగా ప్రతి ఏడాది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఆస్తులను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.