ఆంధ్రప్రదేశ్‌

ఆందోళన కలిగిస్తున్న శిశు మరణాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మార్చి 7: తూర్పు గోదావరి జిల్లాలోని ఏజన్సీ మండలాల్లో ఇటీవలి కాలంలో సంభవిస్తున్న శిశు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏజన్సీ ప్రాంతాల్లో ఏడాది కాలంగా పెరిగిన శిశు మరణాలతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తం కావాలని ప్రభుత్వం ఆదేశించింది. గర్భిణులలో రక్తహీనత, పోషకాహార లోపం తదితర కారణాలతో శిశు మరణాలు సంభవిస్తున్నట్టు గుర్తించారు. ఏజన్సీ ప్రాంతాల్లో మాతా,శిశు మరణాల నియంత్రణకు ఇక నుండి వివిధ శాఖల సమన్వయంతో ప్రత్యేక ముమ్మర కార్యాచరణ ప్రణాళిక అమలుచేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టింది. 2016 ఏప్రిల్ నుండి 2017 ఫిబ్రవరి మధ్య కాలంలో ఈ జిల్లాలోని ఏజన్సీ మండలాల్లో 767 శిశు మరణాలు నమోదయ్యాయి. మైదాన ప్రాంతాలతో పోల్చిచూస్తే గిరిజన ప్రాంతాల్లో శిశు మరణాలు అధికం కావడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఆయా కారణాలపై శాస్ర్తియ అధ్యయనం, విశే్లషణ నిర్వహించి, నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.