ఆంధ్రప్రదేశ్‌

కష్టాల్లో కాకాణి ఓటేయడానికి వస్తే అరెస్టే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, మార్చి 8: సర్వేపల్లి శాసన సభ్యుడు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వైకాపా అధ్యక్షులు కాకాణి గోవర్దనరెడ్డి ప్రస్తుతం పీకల్లోతు కష్టాల్లో ఇర్కుకున్నారు. టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వేలకోట్ల ఆస్తులు కూడబెట్టారని, మలేషియా తదితర దేశాల్లో ఆస్తులను అక్రమంగా కొనుగోలు చేస్తున్నారంటూ ఆరోపించారు. తన ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయంటూ కొన్ని పత్రాలను కాకాణి విలేఖరుల సమావేశంలో చూపించి, ఈ అంశంపై ఉన్నత స్థాయిలో ఫిర్యాదు చేస్తానని అప్పట్లో పేర్కొన్నారు. మర్నాడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ కాకాణి ఆరోపణలు నిరాధారమైనవని ఖండించారు. పైగా ఆ పత్రాలన్నీ నకిలీవని తేల్చిచెప్పారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన కాకాణి వ్యవహార శైలిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టాలని కోరుతూ నెల్లూరు రూరల్‌పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును పలుకోణాల్లో వేగవంతం చేయడంతో ఇటువంటి నకిలీ డాక్యుమెంట్లను తయారు చేస్తూ రాజకీయ నాయకులను బుట్టలో వేసుకునే ఓ అంతరాష్ట్ర ముఠాను చిత్తూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విచారణలో వారు తామే సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణికి నకిలీ పత్రాలను ఇచ్చినట్లు నేరాన్ని ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ సంఘటనతో వారి బుట్టలోపడ్డ కాకాణి సమస్యల్లో చిక్కుకున్నట్లయ్యింది. ఈకేసునకు సంబంధించి కాకాణిని పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉండడంతో ఆయన న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. న్యాయ స్థానం ఆయనకు షరతులు విధిస్తూ వెసులుబాటు కలిపించింది. న్యాయ స్థానం ఉత్తర్వుల మేరకు కాకాణి నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో నిత్యం పోలీసుల విచారణకు హాజరై సంతకాలు పెట్టాల్సి ఉంది. కొద్దిరోజుల పాటు ఈ ఉత్తర్వులను పాటించిన కాకాణి తర్వాత స్టేషన్‌కు వెళ్లి సంతకాలు పెట్టడాన్ని మానివేశారు. దీంతో పోలీసులు అరెస్టుచేసే అవకాశం ఉండడంతో ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా తాజాగా సింగిల్ బెంచ్ ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. కాగా ఇటీవల ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో ఆయన పాల్గొన్నప్పటికీ ఇతరులెవ్వరికీ అందుబాటులో లేకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. జిల్లా వైకాపా అధ్యక్షులు అయినప్పటికి గత 15 రోజులుగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో వైకాపా నిర్వహిస్తున్న పలు సమీక్షలకు ఆయన హాజరు కాలేదు. నెల్లూరుకు వస్తే ఆయన్ని పోలీసులు అరెస్టు చేస్తారని ముందస్తు సమాచారం మేరకు ఆయన జిల్లాకు రావట్లేదని టిడిపి వర్గీయులు ఆరోపిస్తున్నారు.