ఆంధ్రప్రదేశ్‌

నేడు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం/విశాఖపట్నం, మార్చి 8: పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో పట్ట్భద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. ఇందుకోసం మూడు జిల్లాల అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. బుధవారం సాయంత్రానికే బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్సులతో సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసి పోలింగ్ సరళిని పర్యవేక్షించనున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించారు. పట్ట్భద్రుల స్థానానికి 25 మంది, ఉపాధ్యాయల స్థానానికి 10 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అనంతపురం జిల్లాలో పట్ట్భద్రులు 88,823 మంది, ఉపాధ్యాయులు 7,875 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కడప జిల్లాలో 78,168 మంది పట్ట్భద్రులు, 59,708 మంది ఉపాధ్యాయ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కర్నూలు జిల్లాలో పట్ట్భద్రులు 82,591 మంది, ఉపాధ్యాయులు 6,670 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
ప్రతిష్టాత్మకం..‘ఉత్తరాంధ్ర’ ఎన్నిక
ఉత్తరాంధ్ర పట్ట్భద్రుల ఎన్నికను అధికార తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించితీరాలన్న సంకల్పంతో ఈ రెండు పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికకు ఈ రెండు పార్టీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. గత ఎన్నికను కనీసం జిల్లా మంత్రులు కూడా పట్టించుకోలేదు. ఈ ఎన్నిక టిడిపి, బిజెపిలకు దాదాపూ రిఫరెండమనే చెప్పచ్చు. ఎమ్మెల్సీ ఎన్నికల వెనువెంటనే గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికలు రాబోతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వాటిపై ప్రభావం చూపకూడదన్న ఉద్దేశంతో టిడిపి, బిజెపిలు ఈ ఎన్నికలో గెలుపునకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. టిడిపి, బిజెపిలకు చెందిన వారు వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చి వివిధ హోటల్స్‌లో బస చేశారు. గురువారం జరగనున్న పోలింగ్‌లో వీరు ఏవిధంగా వ్యవహరించాలన్న అంశంపై ఇప్పటికే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈ ఎన్నికలో విజయాన్ని కైవసం చేసుకోపోతే, రెండున్నరేళ్ల తమ పాలనపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నట్టు అర్థం చేసుకోవలసి వస్తుందని బిజెపి, టిడిపిలు భావిస్తున్నాయి. విశాఖకు రైల్వే జోన్ ఇచ్చే విషయంలో ప్రజా ప్రతినిధులు స్పష్టత ఇవ్వకపోవడం పట్ల ప్రజలు అసంతృప్తితోనే ఉన్నాఠని చెప్పచ్చు. అలాగే హోదాకు బదులు ప్యాకేజీ తీసుకోవడాన్ని జనం వ్యతిరేకిస్తున్నారు. విశాఖకు పెద్దగా పరిశ్రమలు రాకపోవడం, నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడంతో ప్రజలు అధికార పార్టీలపై గుర్రుగా ఉన్నారు. దీన్ని పిడిఎఫ్ క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. గత రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో పిడిఎఫ్ విజయం సాధిస్తూ వస్తోంది.

పోటీ నుంచి వైదొలగిన సుచరిత
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, మార్చి 8: ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి విస్తృత ప్రచారం చేసుకున్న కృష్ణతేజ విద్యాసంస్థల అధినేత్రి, టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి సతీమణి చదలవాడ సుచరిత పోటీ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. కేబినెట్ హోదాకలిగిన నామినేడెట్ పదవి ఇప్పిస్తామని ఆశ చూపడంతోనే సుచరిత పోటీ నుంచి వైదొలగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో ఇటు టిడిపిలోను, అటు ఉపాధ్యాయుల్లోను చర్చ సాగుతోంది. ఎమ్మెల్సీ టికెట్ తనకే దక్కుతుందని భావించిన సుచరిత ఉపాధ్యాయ సంఘాలతో సంప్రదింపులు జరిపి వారిమద్దతు కూడగట్టుకుంది. అయతే మంత్రి నారాయణ మంగళవారం రాత్రి నారాయణ సుచరితను నెల్లూరుకి పిలిపించి ఆమెతో మంతనాలు జరిపారు. మొత్తానికి చర్చలు ఫలించాయ. ఆమె తప్పుకుంది